Outsourcing Employees: క‌రోనా నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ను..

Telangana Outsourcing Employees: తెలంగాణ‌లో క‌రోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో వైద్య సిబ్బందిని పెంచే క్ర‌మంలో కృషి చేస్తోంది. తెలంగాణ ప్ర‌భుత్వం ఇందులో భాగంగానే...

Outsourcing Employees: క‌రోనా నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ను..
Out Sourcing Employees

Updated on: May 15, 2021 | 6:34 PM

Telangana Outsourcing Employees: తెలంగాణ‌లో క‌రోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో వైద్య సిబ్బందిని పెంచే క్ర‌మంలో కృషి చేస్తోంది. తెలంగాణ ప్ర‌భుత్వం ఇందులో భాగంగానే ఇటీవ‌ల కాంట్రాక్ట్ విధానంలో వేల సంఖ్య‌లో ఉద్యోగుల‌ను నియ‌మించుకోవ‌డం కోసం నోటిఫికేషన్ జారీ చేసిన విష‌యం తెలిసిందే. పెరుగుతోన్న కేసులకు అనుగుణంగా వైద్య సిబ్బంది ఉండాల‌న్న కార‌ణంగానే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇదిలా ఉంటే ఇదే క్ర‌మంలో తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.
ప్ర‌స్తుతం వైద్య‌, ఆరోగ్య శాఖ‌లో కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో ప‌నిచేస్తోన్న ఉద్యోగుల కాల‌ప‌రిమితిని పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. మొత్తం 7,180 తాత్కాలిక ఉద్యోగుల కాల‌ప‌రిమితిని పెంచ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇక కోవిడ్‌19 సేవ‌ల కోసం 1,191 మంది ఉద్యోగుల సేవ‌ల‌ను కొన‌సాగించ‌నున్నారు. వైద్య‌, ఆరోగ్య శాఖ‌లో ప‌నిచేస్తున్న అన్ని ర‌కాల అవుట్ సోర్సింగ్‌, కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవ‌ల‌ను మ‌రో ఏడాది పాటు పొడ‌గిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక పెరుగుతోన్న రోగుల‌కు స‌రిప‌డ వైద్య సిబ్బందిని స‌మ‌కూర్చాల‌నే ఉద్దేశంతో తెలంగాణ ప్ర‌భుత్వం ఏకంగా 50 వేల వైద్య సంబంధిత ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను కోరింది. ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఇక్క‌డ క్లిక్ చేయండి.

Also Read: Black Fungus Guidelines: బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు నోడల్ కేంద్రంగా ఈఎన్‌టీ ఆస్పత్రి.. తెలంగాణ స‌ర్కార్ ఉత్త‌ర్వులు

COVID VACCINATION: వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు తొలగిన అడ్డంకి.. శభాష్ దోవల్ జీ..!

Pregnant Woman Dies: ఆసుప‌త్రుల నిర్ల‌క్ష్యంతో నిండు గ‌ర్భిణి మృతి.. అంత్య‌క్రియ‌ల‌కు నిరాక‌ర‌ణ‌.. అధికారుల ఆదేశాల‌తో..