
తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎడ్, బీపీఎడ్, డీపీఎడ్ సీట్ల భర్తీకి నిర్వహించే ఎడ్‌సెట్, పీఈసెట్‌ల కౌన్సెలింగ్‌ల షెడ్యూల్‌లు విడుదలైనాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ఆయన కార్యాలయంలో ప్రవేశాల కమిటీతో సమావేశం నిర్వహించి కౌన్సెలింగ్ షెడ్యూల్‌లను ఖరారు చేశారు. దీంతో జులై 14న రెండు కౌన్సెలింగ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు జులై 21 నుంచి ప్రారంభంకానుంది. ఇక పీఈసెట్ కౌన్సెలింగ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జులై 23 నుంచి ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ టీజీఈసెట్ తుది విడత కౌన్సెలింగ్ జులై 14 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. జులై 14న ధ్రువపత్రాల పరిశీలన జరగగా.. వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి జులై 14, 15 తేదీల్లో అవకాశం ఇచ్చారు. సీట్ల ప్రొవిజినల్ అలాట్‌మెంట్ జులై 18 లోపు పూర్తికానుంది. ఇతర పూర్తి వివరాలు టీజీఈసెట్ వెబ్‌సైట్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.