TG EAPCET 2025 Counselling: హమ్మయ్య.. ఎట్టకేలకు ప్రారంభమైన ఈఏపీసెట్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ!

ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మరింత ఆలస్యంగా ప్రారంభమైంది. షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం ఉదయం 10 గంటలకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా దానిని సాయంత్రం 4 గంటలకు మార్పు చేశారు. అయితే ఆ తర్వాత కూడా విండో ఓపెన్ కాకపోవడంతో విద్యార్ధులు గందరగోళపడ్డారు. చివరికి..

TG EAPCET 2025 Counselling: హమ్మయ్య.. ఎట్టకేలకు ప్రారంభమైన ఈఏపీసెట్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ!
Eamcet Counselling

Updated on: Jul 07, 2025 | 6:52 AM

హైదరాబాద్‌, జులై 7: తెలంగాణ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మరింత ఆలస్యంగా ప్రారంభమైంది. షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం ఉదయం 10 గంటలకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా దానిని సాయంత్రం 4 గంటలకు మార్పు చేశారు. అయితే ఆ తర్వాత కూడా విండో ఓపెన్ కాకపోవడంతో విద్యార్ధులు గందరగోళపడ్డారు. చివరికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియను మరోసారి మార్పు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి నమోదు చేసుకునే అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. వెబ్‌ ఆప్షన్లకు జులై 6 నుంచి 10 వరకు అవకాశం ఇచ్చారు.

జులై 14, 15 తేదీల్లో తొలి విడత మాక్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. ఇక జులై 18లోపు మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. జులై 25 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది. జులై 26 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. జులై 26, 27 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. జులై 30లోపు రెండో విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. జులై 31 నుంచి ఆగస్టు 2వ తేదీలోపు విద్యార్థులు సీట్లు పొందిన ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.

ఇక మూడో విడత కౌన్సెలింగ్‌ ఆగస్టు 5 నుంచి ప్రారంభంకానుంది. ఆగస్టు 5న స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 6న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. ఆగస్టు 6, 7 తేదీల్లో తుది విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 10లోపు తుది విడత సీట్లు కేటాయింపు పూర్తి చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.