TS Eamcet 2024 Exam Date: మే 10 నుంచి తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలు.. ఒకట్రెండు రోజుల్లో షెడ్యూల్‌ విడుదల

|

Jan 04, 2024 | 10:37 AM

తెలంగాణ ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌, ఫార్మసీ) పరీక్షలను మే 10 నుంచి నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. రెండు రోజులపాటు నాలుగు సెషన్లలో అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగానికి చెందిన పరీక్షలు జరుగుతాయి. మూడు రోజులు ఆరు సెషన్లలో ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఎంసెట్‌..

TS Eamcet 2024 Exam Date: మే 10 నుంచి తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలు.. ఒకట్రెండు రోజుల్లో షెడ్యూల్‌ విడుదల
TS Eamcet 2024
Follow us on

హైదరాబాద్‌, జనవరి 4: తెలంగాణ ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌, ఫార్మసీ) పరీక్షలను మే 10 నుంచి నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. రెండు రోజులపాటు నాలుగు సెషన్లలో అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగానికి చెందిన పరీక్షలు జరుగుతాయి. మూడు రోజులు ఆరు సెషన్లలో ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఎంసెట్‌ పరీక్షాతేదీలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఎంసెట్‌కు ముందు లేదా ఎంసెట్‌ తర్వాత బీటెక్‌లో ల్యాట్రల్‌ ఎంట్రీకోసం నిర్వహించే ఈసెట్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఒకేరోజున రెండు లేదా మూడు సెషన్లలో ఈసెట్‌ ఎగ్జామ్‌ జరుగుతుంది. ఎంసెట్‌తో పాటు ఈసెట్‌, ఎడ్‌సెట్‌, ఐసెట్‌, లాసెట్‌ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఈ వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మరో పరీక్ష జరగకుండా ఉండే విధంగా పరీక్ష తేదీలను ఖరారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీసీఎస్‌ ప్రతినిధులతో చర్చించి, పలు జాగ్రత్తలు తీసుకొని పరీక్షల తేదీలను ఖరారు చేసినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఏడాది కన్వినర్ల నియామకాల్లో గత సంప్రదాయాలకు భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారు.

ఏటా ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు ఆసక్తిచూపే వర్సిటీలే కన్వినర్లను కూడా నియమించుకోవాలని ఉన్నత విద్యామండలి లేఖలు రాస్తుంది. ఈ లేఖలు అందిన వెంటనే కన్వీనర్లను నియమిస్తాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను విడుదల చేస్తాయి. ఈ ఏడాది ఉన్నత విద్యామండలికి పూర్తిస్థాయి చైర్మన్‌ లేకపోవడవంతో ఎంసెట్‌ సహా పలు ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ముందుగానే ప్రకటిస్తున్నారు. జేఈఈ మెయిన్‌ రెండోవిడతను ఏప్రిల్‌ 1 నుంచి 15, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామ్‌ మే 26న, నీట్‌ (యూజీ) పరీక్షను మే 5న నిర్వహిస్తారు. విద్యార్థుల్లో సహజంగా ఉండే పరీక్షల టెన్షన్‌ను దూరం చేసేందుకు తొలుత పరీక్షాతేదీలను ప్రకటిస్తారు. ఆ తర్వాత సెట్స్‌ను నిర్వహించే వర్సిటీలు, కన్వీనర్లను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.