
హైదరాబాద్, ఆగస్టు 2: ఎంసెట్ ఇంజినీరింగ్ తుది విడత వెబ్ కౌన్సెలింగ్ రేపట్నుంచి (ఆగస్టు 4) ప్రారంభంకానున్నది. రేపటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, స్లాట్‌బుకింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. ఆగస్టు 9న సీట్లు కేటాయిస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. రెండో విడత కౌన్సెలింగ్ ముగిశాక బీటెక్‌లో అన్ని బ్రాంచుల్లో కలిసి మొత్తం 12,013 సీట్లు మిగిలాయి.
సీఎస్‌ఈ, ఐటీ అనుబంధ కోర్సుల్లో 3,137 సీట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కోర్సుల్లో 3,805 సీట్లు, మెకానికల్, సివిల్ కోర్సుల్లో 4,592 సీట్లు, ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో 479 సీట్ల చొప్పున మిగిలాయి. ఇవేకాక ఆన్‌లైన్ సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయని విద్యార్ధుల సీట్లు కూడా మిగులుతాయి. ఈ మొత్తం సీట్లకు తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. తుది విడత కౌన్సెలింగ్‌లోనే స్పోర్ట్స్, ఎన్‌సీసీ కోటా సీట్లను కూడా భర్తీచేస్తారు. తుది విడత కౌన్సెలింగ్ తర్వాత ఆగస్టు 23న స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ మార్గదర్శకాలను విడుదల చేస్తారు.
TS Eamcet 3rd Phase Counselling Schedule
ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌తోపాటు స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ఆగస్టు 17 నుంచి ప్రారంభమవుతుంది.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.