TS Eamcet 2023: ప్రశాంతంగా ప్రారంభమైన తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలు.. 137 పరీక్షా కేంద్రాల్లో రోజుకు 2 సెషన్లలో

|

May 10, 2023 | 10:05 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ 2023 పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 7:30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులను అనుమతిస్తున్నారు. పరీక్ష రాసే విద్యార్థులు తమ తమ సెంటర్ల వద్ద ఉదయాన్నే చేరుకున్నారు. ఈరోజు అగ్రికల్చర్ విభాగం..

TS Eamcet 2023: ప్రశాంతంగా ప్రారంభమైన తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలు.. 137 పరీక్షా కేంద్రాల్లో రోజుకు 2 సెషన్లలో
Ts Eamcet 2023
Follow us on

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ 2023 పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 7:30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులను అనుమతిస్తున్నారు. పరీక్ష రాసే విద్యార్థులు తమ తమ సెంటర్ల వద్ద ఉదయాన్నే చేరుకున్నారు. ఈరోజు అగ్రికల్చర్ విభాగం ఎంసెట్ పరీక్ష జరుగనుంది. బ్లూ/బ్లాక్‌ పెన్, హాల్‌ టికెట్లు మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. కాలిక్యులేటర్లు, చేతి వాచిలకు అనుమతి లేదు. పరీక్ష హాల్లోకి వెళ్లేముందు బయోమెట్రిక్‌ హాజరు వేసిన తర్వాత లోనికి అనుమతిస్తున్నారు. చేతికి మెహిందీ వద్దన్న అధికారులు. పరీక్ష కేంద్రాలకు చేరుకునే విద్యార్ధులు పాన్‌ కార్డు, ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌ పోర్టు, కాలేజీ ఐడీ.. ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా తీసురావాలి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగనుంది. మధ్యాహ్నం రెండో సెషన్‌లో పరీక్షకు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వనున్నారు.

కాగా తెలంగాణలో 104, ఏపీలో 33తో కలిపి మొత్తం 137 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. గ్రేటర్‌ పరిధిలో 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 3.20 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్ష రాయనున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 1,71,706 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 10, 11 తేదీల్లో అగ్రికల్చర్‌, 12, 13, 14 తేదీల్లో ప్రతి రోజూ రెండు సెషన్ల చొప్పున ఇంజనీరింగ్‌ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్ష హాలులో రఫ్‌వర్క్‌ కోసం ఇచ్చిన పేపర్లను అభ్యర్థులు అక్కడే వదిలి రావాలని తెలిపారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌ కాబట్టి ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకురావాలని విద్యార్ధులకు ఎంసెట్ కన్వీనర్ సూచించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగుతున్నట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.