TG CPGET 2024 Results: నేడే తెలంగాణ సీపీగెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే

|

Aug 09, 2024 | 6:56 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని అనుబంధ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఎడ్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రవేశ పరీక్షలు (టీజీ సీపీగెట్‌ 2024) ఫలితాలు ఈ రోజు విడుదలకానున్నాయి. శుక్రవారం (ఆగస్టు 9న) మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి..

TG CPGET 2024 Results: నేడే తెలంగాణ సీపీగెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే
TG CPGET 2024
Follow us on

హైద‌రాబాద్, ఆగస్టు 9: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని అనుబంధ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఎడ్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రవేశ పరీక్షలు (టీజీ సీపీగెట్‌ 2024) ఫలితాలు ఈ రోజు విడుదలకానున్నాయి. శుక్రవారం (ఆగస్టు 9న) మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ప్రొఫసర్‌ ఆర్‌ లింబాద్రి చేతుల మీదగా విడుదల చేస్తారని సీపీగెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్ధుల వివరాలు నమోదు చేసి, ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టీజీ సీపీగెట్‌ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, మహిళా యూనివర్సిటీ, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని దాదాపు 297 పీజీ కాలేజీల్లో మొత్తం 51 కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

తెలంగాణ సీపీగెట్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

నీట్‌ పీజీ-2024 అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే!

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ పీజీ) 2024 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ మేరకు ఎన్‌బీఈఎంఎస్‌ ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వివరాలు నమోదు చేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా 185 నగరాల్లో ఆగస్టు 11న రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా మెడికల్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారన్న సంగతి తెలిసిందే.

నీట్‌ పీజీ-2024 అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.