TS Free Inter Admissions 2024: పేద విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఉచిత ప్రవేశాలు

|

May 19, 2024 | 7:30 AM

ఉన్నత భవిష్యత్తు పొందాలంటే గొప్పగొప్ప కార్పొరేట్‌ కాలేజీల్లో చదవాలని ఎందరో కలలు కంటారు. కానీ అది పేద, మధ్యతరగతి కుటుంభీకులకు అందని ద్రాక్షగానే ఉంటుంది. లక్షల్లో ఫీజులు కట్టలేక గుటకలు మింగి సర్దిచెప్పుకునే వారు. కానీ ఇప్పుడు పెద్దింటి చదువులు పేద విద్యార్ధులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో పేద విద్యార్ధులకు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను..

TS Free Inter Admissions 2024: పేద విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
TS Corporate College Free Inter Admission
Follow us on

హైదరాబాద్‌, మే 19: ఉన్నత భవిష్యత్తు పొందాలంటే గొప్పగొప్ప కార్పొరేట్‌ కాలేజీల్లో చదవాలని ఎందరో కలలు కంటారు. కానీ అది పేద, మధ్యతరగతి కుటుంభీకులకు అందని ద్రాక్షగానే ఉంటుంది. లక్షల్లో ఫీజులు కట్టలేక గుటకలు మింగి సర్దిచెప్పుకునే వారు. కానీ ఇప్పుడు పెద్దింటి చదువులు పేద విద్యార్ధులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో పేద విద్యార్ధులకు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు వివిధ ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీల్లో అడ్మిషన్లు పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.ఆసక్తి కలిగిన విద్యార్ధులు మే 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నారు.

ఏయే అర్హతలు ఉండాలంటే..

పదో తరగతిలో కనీసం 7జీపీఏ.. ఆ పైగా ఫలితాలు సాధించిన విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు, నవోదయ, ఎయిడెడ్‌, జెడ్‌పీ, ఆదర్శ, కస్తూర్బా స్కూళ్లలో చదివిన విద్యార్థులు ఇందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సీట్లు కల్పిస్తారు. అయితే విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు అయితే రూ.లక్ష, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు అయితే రూ.2 లక్షలకు మించకుండా ఉండాలి. మెరిట్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ ఆటోమెటిక్‌ సిస్టమ్‌ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. అనంతరం సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పలిచి అడ్మిషన్‌ కాన్ఫామ్‌ చేస్తారు. మే 30, 2024వ తేదీని ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు.

తెలంగాణ పీజీఈసెట్‌ 2024 తేదీల్లో మార్పు

తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించనున్న పీజీ ఇంజినీరింగ్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్‌ 2024) నిర్వహణ తేదీలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత ఇచ్చిన ప్రకటన ప్రకారం జూన్‌ 6 నుంచి 9 వరకు పరీక్షలను జరుపుతామని అధికారులు ప్రకటించారు. సరిగ్గా ఇదే తేదీల్లో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షలు, అలాగే జూన్‌ 9న గ్రూపు1 పరీక్ష కూడా ఉంది. దీంతో పీజీఈసెట్‌ పరీక్షలను జూన్‌ 10 నుంచి 13 వరకు నిర్వహించాలని పీజీఈసెట్‌ 2024 కన్వీనర్‌ ప్రొఫెసర్‌ అరుణకుమారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.