BC Study Circle: నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ గ్రూప్‌-4 ఉద్యోగాలకు ఉచిత కోచింగ్‌.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

|

Mar 16, 2023 | 7:55 PM

గ్రూప్‌-4 పోస్టులకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు ఏప్రిల్‌ 4 నుంచి హైదరాబాద్‌ ప్రభుత్వ సిటీ కళాశాలలో ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ అలోక్‌కుమార్‌ ఓ ప్రకటనలో..

BC Study Circle: నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ గ్రూప్‌-4 ఉద్యోగాలకు ఉచిత కోచింగ్‌.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Group 4 Free Coaching
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 ఉద్యోగాలకు ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దాదాపు 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 1న రెండు పేపర్లకు గ్రూప్‌ 4 పరీక్ష జరనుంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల నుంచి 30 నిముషాల వరకు పేపర్‌ 1, మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష నిర్వహించనున్నారు.

గ్రూప్‌-4 పోస్టులకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు ఏప్రిల్‌ 4 నుంచి హైదరాబాద్‌ ప్రభుత్వ సిటీ కళాశాలలో ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ అలోక్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్లి కలిగిన అభ్యర్థులు మార్చి 31లోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. నింపిన దరఖాస్తులను బీసీ స్టడీసర్కిల్‌, ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, ఓయూ క్యాంపస్‌లో అందజేయాలన్నారు. బీసీ స్టడీసర్కిల్‌ లేదా ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లలో ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ శిక్షణ తీసుకున్న అభ్యర్థులు అనర్హులుగా వెల్లడించారు. సందేహాలకు 040-27077929, 040-24071178 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.