TS 10th Class Results 2023: ‘పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులు మనోధైర్యం కోల్పోవొద్దు.. ఒక్కసారి అమ్మానాన్నల గురించి ఆలోచించండి’

|

May 10, 2023 | 1:03 PM

పది ఫలితాల సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ.. పరీక్షల ప్రారంభంలో చిన్న చిన్ని సంఘటనలు జరిగినా ఆ తర్వాత మళ్లీ ప్రశాంతంగా జరిగాయి. మనోధైర్యం కోల్పోకుండా విద్యార్ధులందరూ ఎగ్జామ్స్ రాశారు. ఈసారి వందశాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహించినప్పటికీ..

TS 10th Class Results 2023: పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులు మనోధైర్యం కోల్పోవొద్దు.. ఒక్కసారి అమ్మానాన్నల గురించి ఆలోచించండి
Sabitha Indra Reddy
Follow us on

తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఈ రోజు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు మొత్తం 4,91,862 మంది విద్యార్ధులు రాస్తే 4,84,370 మంది పాస్ అయ్యారు. ప్రైవేట్‌గా 7,492 మంది రాశారు. కాగా గతేడాది 5,04,398 మంది టెన్త్‌ పరీక్షలు రాశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ.. పరీక్షల ప్రారంభంలో చిన్న చిన్ని సంఘటనలు జరిగినా ఆ తర్వాత మళ్లీ ప్రశాంతంగా జరిగాయి. మనోధైర్యం కోల్పోకుండా విద్యార్ధులందరూ ఎగ్జామ్స్ రాశారు. ఈసారి వందశాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహించినప్పటికీ విద్యార్ధులు బాగా రాశారు. నిన్న ఇంటర్ ఫలితాలతో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఫెయిల్ అయిన విద్యార్థులు తొందర పడొద్దు. అమ్మానాన్నల గురించి ఆలోచించండి. సప్లమెంటరీ రాసే అవకాశం ఉంది. జూన్ 14 నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు ధైర్యంగా ప్రిపేరవ్వండి. ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దని విద్యార్ధులకు సూచనలు జారీ చేశారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి..

ఇంటర్‌ ఫలితాల్లో రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్ధులు అత్యుత్తమ ప్రతిభకనబరిచారు. పదో తరగతి ఫలితాల్లో కూడా రెసిడెన్షియల్ స్కూళ్లు మంచి ఉత్తీర్ణత శాతాన్ని నమోదుచేశాయి. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్లలో దాదాపు 98.25% విద్యార్ధులు ఉత్తీర్ణత పొందారు. అలాగే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 95.24%, బీసీ వెల్ఫేర్ స్కూల్లో 95.03% మేర పాస్‌ అయ్యారు. ఇక అదిలాబద్‌లో తెలుగు సమాధాన పత్రాల బండెల్ మిస్ అయిన విద్యార్థులకు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పాస్ చేశాం. వారి అభిప్రాయం తీసుకొని 9 మంది ఫలితాలు ఇచ్చామని సబిత వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.