హైదరాబాద్, మే 26: తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. హాల్‌టికెట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు తమ పాఠశాల నుంచి హాల్ టికెట్లు పొందవచ్చు. కాగా రాష్ట్రంలో జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ ట్రైనింగ్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జూన్ 8న ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్‌సెట్) 2024 నిర్వహించేందుకు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు మే 30న విడుదల కానున్నాయి. పరీక్ష అనంతరం జూన్ 15న ప్రిలిమినరీ కీ విడుదల చేశాక, జూన్ 18 వరకు ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.