TS 10th Class Results 2023: తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో బాలికలదే హవా.. జూన్ 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

|

May 10, 2023 | 12:39 PM

తెలంగాణ పదో తరగతి 2023 పరీక్షల ఫలితాలు బుధవారం (మే 10) మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌..

TS 10th Class Results 2023: తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో బాలికలదే హవా.. జూన్ 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
TS 10th Class Results
Follow us on

తెలంగాణ పదో తరగతి 2023 పరీక్షల ఫలితాలు బుధవారం (మే 10) మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు నేరుగా ఇక్కడ ఫలితాలు చెక్ చేసుకోండి. మొత్తం విద్యార్ధుల్లో 86.68 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలియజేశారు. ఈసారి కూడా బాలికలు పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. 88.53 శాతం మేర ఉత్తీర్ణత పొందగా బాలురు 84.68 శాతం పాసయ్యారు. నిర్మల్‌ జిల్లా అత్యధికంగా 99 శాతం ఉత్తీర్ణతతో టాప్‌లో నిలిచింది. 98.65 ఉత్తీర్ణతతో సంగారెడ్డి మూడో స్థానంలో నిలిచింది. వికారాబాద్‌ జిల్లాలో అతితక్కువగా 59.46 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

పదో తరగతి ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి.

 

ఇవి కూడా చదవండి

2793 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. 25 పాఠశాలల్లో సున్న ఉత్తీర్ణత నమోదైందన్నారు. 11 పేపర్ల నుంచి 6 పేపర్లకు పరీక్ష నిర్వహించినప్పటికీ విద్యార్ధులు బాగా పరీక్షలు రాసినట్లు మంత్రి సబిత పేర్కొన్నారు. మార్కులు తక్కువ వచ్చినవారు, ఫెయిల్‌ అయిన విద్యార్ధులు నిరాశ చెంది ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్ధులకు మంత్రి సూచించారు. తల్లిదండ్రులు, టీచర్లు విద్యార్ధులకు సరైన మార్గనిర్దేశం చేయవల్సిందిగా కోరారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసి మళ్లీ పాస్‌ అవ్వొచ్చని, పరీక్షలకు మళ్లీ ప్రిపేర్‌ అవ్వవలసిందిగా మంత్రి సబితా సూచించారు. జూన్ 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.