10th Class 2026 Exams: పబ్లిక్‌ పరీక్షలు రాయనున్న పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్‌.. ఇదే చివరి ఛాన్స్!

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఏప్రల్‌ 13వ తేదీ వరకు ఆయా తేదీల్లో ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి..

10th Class 2026 Exams: పబ్లిక్‌ పరీక్షలు రాయనున్న పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్‌.. ఇదే చివరి ఛాన్స్!
10th Class Public Exams 2026 Fee Payment Deadline

Updated on: Jan 07, 2026 | 3:10 PM

హైదరాబాద్‌, జనవరి 7: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఏప్రల్‌ 13వ తేదీ వరకు ఆయా తేదీల్లో ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు మాత్రమే ఉంటాయి. దీంతో పదో తరగతి విద్యార్ధులు ప్రిపరేషన్‌లో బిజీ గా ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపులు కూడా మొదలయ్యాయి. ఈ ఏడాది పదో తరగతి రెగ్యులర్‌గా చదువుతున్న విద్యార్ధులతోపాటు గతంలో ఫెయిలైన విద్యార్ధులు కూడా పరీక్షల రాయాలనుకుంటే ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే దరఖాస్తు రుసుము గడువు ముగియడంతో తత్కాల్‌ పథకం కింద దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ పీవీ శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు.

ఇప్పటి వరకు ఫీజు చెల్లించని అభ్యర్ధులు రూ.1000 ఆలస్య రుసుంతో జనవరి 21 నుంచి 27వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. ఈ మేరకు విద్యార్ధులకు అవకాశం కల్పించారు. ఇదే చివరి అవకాశమని, గడువు ముగిసిన తర్వాత విద్యార్ధుల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ ఫీజు స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. ఇక జనవరి 29వ తేదీలోపు ఫీజు చెల్లించిన టెన్త్‌ విద్యార్థుల సమాచారాన్ని ఆయా హెడ్ మాస్టర్లు డీఈవోలకు సమర్పించవల్సి ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు పరీక్ష ఫీజు గడువు పొడిగించిన నేపథ్యంలో మరోసారి ఈ మేరకు పరీక్ష ఫీజు చెల్లించడాని అవకాశం కల్పించారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 పూర్తి టైం టేబుల్ ఇదే..

  • 14 మార్చి 2026 (శనివారం) ఫస్ట్ లాంగ్వేజ్
  • 18 మార్చి 2026 (బుధవారం) సెకెండ్ లాంగ్వేజ్
  • 23 మార్చి 2026 (సోమవారం) థర్డ్ లాంగ్వేజ్
  • 28 మార్చి 2026 (శనివారం) మాథెమాటిక్స్
  • 02 ఏప్రిల్ 2026 (గురువారం) ఫిజికల్ సైన్స్
  • 07 ఏప్రిల్ 2026 (మంగళవారం) బయోలాజికల్ సైన్స్
  • 13 ఏప్రిల్ 2026 (సోమవారం) సోషల్ స్టడీస్
  • 15 ఏప్రిల్‌ 2026 (బుధవారం) ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1
  • 16 ఏప్రిల్‌ 2026 (గురువారం) ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.