Telangana 10th Class: పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ కీలక నిర్ణయం.. ఈ ఏడాది నుంచి..

| Edited By: Anil kumar poka

Oct 11, 2021 | 5:49 PM

Telangana 10th Class: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణపై తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి పరీక్ష పత్రాలను తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఇప్పటి వరకు 11 ప్రశ్నా..

Telangana 10th Class: పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ కీలక నిర్ణయం.. ఈ ఏడాది నుంచి..
Tenth Ts
Follow us on

Telangana 10th Class: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణపై తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి పరీక్ష పత్రాలను తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఇప్పటి వరకు 11 ప్రశ్నా పత్రాలకు ఉండగా వీటిని 6 కుదిస్తూ విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్‌ నేపథ్యంలో నెలకొన్ని పరిస్థిల కారణంగా విద్యార్థులపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021-2022 విద్యా సంవత్సరానికి గానూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇకపై ఒక్కో స‌బ్జెక్టుకు ఒక్కో పేప‌రే ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాదికి గానూ ఉర్దూను సెకండ్ ల్యాంగ్వేజ్‌ను ప‌రిగ‌ణిస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేర‌కు ప‌ది ప‌రీక్షల విధానంపై విద్యాశాఖ కార్యద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. 2022 నాటి పదో పరీక్షలకు సంబంధించి వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులకు ఎంతో లాభం చేకూర్చేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 11 పేపర్‌ల కారణంగా పరీక్షలు ఎక్కువ రోజులు జరుగుతాయి. ఇది విద్యార్థులకు ఇబ్బందిగా మారో అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా కరోనా మళ్లీ ఎప్పుడు ఉగ్రరూపం దాల్చుతుందో తెలియని నేపథ్యంలో విద్యా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులకు మేలు చేస్తుంది.

Read Also:  సమంతపై వస్తోన్న రూమర్స్‌పై నాగ చైతన్య స్పందించాలి: సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్

ఈ ఫోటోలో సింహాన్ని గుర్తించండి.. కనిపెట్టండి అంత ఈజీ కాదు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

భారీ పామును చెడుగుడు ఆడుకున్న కుక్క.. మాములుగా లేదుగా.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

135 పరుగుల టార్గెట్.. ఈ బ్యాట్స్‌మెన్ ఒక్కడే ఒంటరిగా సెంచరీతో కదంతొక్కాడు.. ఎవరో తెలుసా?