Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TCS Recruitment: మహిళలకు గుడ్‌ న్యూస్‌.. భారీగా ఉద్యోగులను తీసుకోనున్న సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌..

TCS Recruitment: ప్రముఖ భారతీయ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ మహిళా అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రకరకాల కారణాలతో కెరీర్‌లో గ్యాప్‌ వచ్చిన మహిళల కోసం ప్రత్యేకంగా ఓ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను...

TCS Recruitment: మహిళలకు గుడ్‌ న్యూస్‌.. భారీగా ఉద్యోగులను తీసుకోనున్న సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 09, 2021 | 6:31 AM

TCS Recruitment: ప్రముఖ భారతీయ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ మహిళా అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రకరకాల కారణాలతో కెరీర్‌లో గ్యాప్‌ వచ్చిన మహిళల కోసం ప్రత్యేకంగా ఓ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు టీసీఎస్‌ తెలిపింది. అనుభవం, ప్రతిభ ఉన్న మహిళల కోసం ఉద్యోగనియామకాలు చేపట్టనున్నట్లు టీసీఎస్‌ ప్రతినిధి తెలిపారు. మంచి ట్యాలెంట్‌ ఉండి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందన్న నమ్మకంతో ఉన్న వారి కోసం ఈ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక స్థాయిలో నైపుణ్యాలు ఉన్న మహిళా అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న టీసీఎస్‌ సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని టీసీఎస్‌ సూచించింది. మారుతోన్న ప్రపంచంలో నేర్చుకోవడం అనేది ఒకటే మారకుండా ఉంటుందని తెలిపారు.

రెండు నుంచి ఐదు ఏళ్ల అనుభవం ఉన్న మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని టీసీఎస్‌ తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేట్‌/పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు టీసీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన నైపుణ్యాలు.. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఎస్‌క్యూఎల్‌ సర్వర్‌ డీబీఏ, లైనెక్స్‌ అడ్మినిస్ట్రేటర్‌, నెట్‌ వర్క్‌ అడ్మిన్‌, మెయిన్‌ ఫ్రెమ్‌ అడ్మిన్‌, ఆటోమేషన్‌ టెస్టిగ్‌, ఆంగుల్‌ జేఎస్‌, ఒరాకిల్‌ డీబీఏ, సిట్రిక్స్‌ అడ్మినిస్ట్రేటర్‌, జావా డెవలపర్‌, డాట్‌ నెట్‌ డెవలపర్‌, ఆండ్రాయిడ్‌ డెవలపర్‌, ఐఓస్‌ డెవలపర్‌, విండోస్‌ అడ్మిన్‌, పైథాన్‌ డెవలపర్‌, పీఎల్‌ఎస్‌క్యూఎల్‌, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Bank Of Baroda Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. అర్హులెరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

UGC NET Exam 2021: అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు ఉంటే ఇలా సరిచేసుకోండి.. చివరి తేదీ ఎప్పుడంటే..

AP EAMCET Results 2021: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల.. సులువుగా ఇలా చెక్ చేసుకోండి..