SVRRGG Hospital: తిరుపతిలోని ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగాలనియామకం.. రేపే చివరి తేదీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే

| Edited By: Surya Kala

Jul 15, 2021 | 8:13 AM

SVRRGG Hospital : ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వానికి చెందిన తిరుపతిలోని ఎస్‌వీఆర్‌ఆర్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌..

SVRRGG Hospital: తిరుపతిలోని ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగాలనియామకం.. రేపే చివరి తేదీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే
Svrr Hospital
Follow us on

SVRRGG Hospital : ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వానికి చెందిన తిరుపతిలోని ఎస్‌వీఆర్‌ఆర్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ లోఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్దతిలో మొత్తం 162 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పీడియాట్రీషియన్స్‌, స్టాఫ్‌ నర్సు, సపోర్టివ్‌ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టుల అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. ఈ మేరకు అర్హులైన ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టింది.. రేపే (జూలై 16వ తేదీ) చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని అనుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్ https://chittoor.ap.gov.in/ సందర్శించాల్సి ఉంది.

ఉద్యోగ వివరాలు : పీడియాట్రీషియన్స్‌, స్టాఫ్‌ నర్సు, సపోర్టివ్‌ స్టాఫ్.

పీడియాట్రీషియన్స్‌ కు అర్హత: ఎండీ / డీఎన్‌బీ / డీసీహెచ్‌ ఉత్తీర్ణత. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి

స్టాఫ్‌ నర్సు పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునేవారు ఇంటర్మీడియట్‌తో పాటు డిప్లొమా (జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ) / బీఎస్సీ, ఎమ్మెస్సీ (నర్సింగ్‌) ఉత్తీర్ణత పొంది ఉండాలి.

సపోర్టివ్‌ స్టాఫ్ అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి / తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత పొంది ఉండాలి

వయస్సు : 42 ఏళ్ల గరిష్ట పరిమిత

వేతనం : నెలకు రూ.15,000 – రూ. 1,58,000

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 13, 2021.

దరఖాస్తులకు చివరితేది: జూలై 16, 2021.

దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా:
office of the Superintendent,
SVRR GGH,
Tirupati
Andhra Pradesh

Also Read: ఈ రోజు ఏ రాశివారికి ఏఏ రంగాలు అనుకూలంగా ఉన్నాయి.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే శుభఫలితాలు పొందుతారంటే..