SVPNPA Hyderabad: హైదరాబాద్‌-సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..

అఖిల భారత సివిల్‌ సర్వీసెస్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అయిన హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ.. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఫొటోగ్రాఫిక్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, అసిస్టెంట్ (మినిస్టీరియల్) తదితర పోస్టుల భర్తీకి..

SVPNPA Hyderabad: హైదరాబాద్‌-సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..
SVPNPA Hyderabad

Updated on: Oct 13, 2022 | 5:02 PM

అఖిల భారత సివిల్‌ సర్వీసెస్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అయిన హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ.. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఫొటోగ్రాఫిక్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, అసిస్టెంట్ (మినిస్టీరియల్) తదితర ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, పీజీ, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలున్నవారు అక్టోబర్‌ 28, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.45,879ల నుంచి రూ.1,18,645ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు: 1
  • ఫొటోగ్రాఫిక్ ఆఫీసర్ పోస్టులు: 1
  • జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులు: 1
  • అసిస్టెంట్(మినిస్టీరియల్) పోస్టులు: 1
  • ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు: 1
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులు: 2

అడ్రస్‌: The Assistant Director (Estt.I), Sardar Vallabhbhai Patel National Police Academy, shivrampally, Raghavendra Nagar, Hyderabad, Telangana 500052.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.