AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ టీచర్లకు సుప్రీంకోర్టు షాక్.. 2028 వరకు మాత్రమే గడువు..!

Teacher Eligibility Test Mandatory: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా TET అర్హత తప్పనిసరేనని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. 2025 తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన ధర్మాసనం, ఉపాధ్యాయులు TET అర్హత సాధించేందుకు ఆగస్టు 31, 2028 వరకు గడువు పొడిగించింది. పిల్లల నాణ్యమైన విద్యా హక్కు కోసం TET అవసరమని, అర్హత సాధించని వారికి సర్వీసు కొనసాగింపు ఉండదని స్పష్టం చేసింది.

ఆ టీచర్లకు సుప్రీంకోర్టు షాక్.. 2028 వరకు మాత్రమే గడువు..!
Supreme Court Teachers
Gopikrishna Meka
| Edited By: |

Updated on: May 30, 2026 | 12:15 PM

Share

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు TET పరీక్ష తప్పనిసరి అని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. 2025 తీర్పును సమీక్షించాలని కోరిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)ను ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా తప్పనిసరి చేస్తూ 2025లో ఇచ్చిన తీర్పును మరోసారి సుప్రీంకోర్టు సమర్ధించింది. ఉపాధ్యాయులు TET అర్హత సాధించడానికి ఆగస్టు 31, 2028 వరకు గడువు పొడిగిస్తూ జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ మన్‌మోహన్ ధర్మాసనం తీర్పును వెలువరించింది..పిల్లల విద్యా భవిష్యత్తుకు ఉపాధ్యాయుల సర్వీసు భంగం కలిగించకూడదన్న సుప్రీంకోర్టు.. TET కేవలం చట్టపరమైనది మాత్రమే కాదనీ ఆర్టికల్ 21A కింద నాణ్యమైన విద్యా హక్కుకు సంబంధించిన రాజ్యాంగపరమైన అంశంగా అభివర్ణించింది.

2025 తీర్పు

2025 సెప్టెంబర్ 1న అంజుమన్ ఇషాత్-ఎ-తాలీమ్ ట్రస్ట్ vs మహారాష్ట్ర రాష్ట్రం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో RTE చట్టం, 2009 కింద TET అర్హత తప్పనిసరి అని స్పష్టం చేసింది.2009లోపు నియమితులైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా TET పాస్ కావాలి. సూపర్ అన్యువేషన్‌కు ఇంకా 5 సంవత్సరాలు మిగిలి ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలో TET అర్హత సాధించాలి. అంతేకాదు ప్రమోషన్లకు TET తప్పనిసరి.ఈ తీర్పుపై వివిధ రాష్ట్రాలు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుమారు 70 సమీక్ష పిటిషన్లు దాఖలు చేశారు.

2010లోపు నియమితులైన ఉపాధ్యాయులపై TETను రెట్రోస్పెక్టివ్‌గా వర్తింపజేయడం అన్యాయంగా ఉపాధ్యాయులు పేర్కొన్నారు. అప్పటి నియామకనిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు నియమితులయ్యారు. అయితే గతంలో NCTE 2010 నోటిఫికేషన్‌లో వారికి మినహాయింపు ఇచ్చింది. TETలో అర్హత సాధించకపోతే పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోతే విద్యార్థుల విద్యకు అంతరాయం ఏర్పడుతుందన్న వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఇవి కూడా చదవండి

RTE చట్టం అమలులోకి వచ్చి 15 ఏళ్లు, 2017 సవరణ అమలులోకి వచ్చి సుమారు ఒక దశాబ్దం గడుస్తుందనీ ఇంత సమయం ఉపాధ్యాయులకు TET అర్హత సాధించడానికి సరిపోతుందని పేర్కొంది. ఉపాధ్యాయుల సేవలు కాపాడాలనే కారణంతో పిల్లల విద్యా భవిష్యత్తుతో రాజీపడమంటూ RTE చట్టం పిల్లల కోసం ఉండే చట్టం అని సబార్డినేట్ లెజిస్లేషన్ (నోటిఫికేషన్లు) పేరెంట్ స్టాట్యూట్ (RTE చట్టం)ను అధిక్రమించలేవని పేర్కొంది. ఉపాధ్యాయుల కష్టాలపై సానుభూతి వ్యక్తం చేసిన కోర్టు.. అసురక్షా భావన మాత్రమే మా తీర్పును మార్చడానికి కారణం కాదని స్పష్టం చేసింది.ఈ తీర్పుతో ఆగస్టు 31, 2028 నాటికి TET అర్హత సాధించని ఉపాధ్యాయులు సర్వీసు కొనసాగించడానికి అవకాశం ఉండదు.

Follow Us