NEET UG 2024 Exam Result: ‘జులై 20న నీట్‌ మార్కులు వెబ్‌సైట్లో ఉంచండి’.. ఎన్టీయేకి సుప్రీం కోర్టు ఆదేశం

|

Jul 19, 2024 | 8:42 AM

నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై భారత సర్వోన్నత న్యాయస్థానం జులై 18న పిటిషన్లను విచారించింది. పరీక్ష కేంద్రం, నగరాల వారీగా అభ్యర్ధుల మార్కులకు సంబంధించిన ఫలితాలు ప్రకటించాలని ఎన్‌టీఏను ఆదేశించింది. జులై 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు మార్కుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని పేర్కొంది. పరీక్ష ప్రక్రియ, సమగ్రతను పారదర్శకతను నిర్ధారించడానికి..

NEET UG 2024 Exam Result: జులై 20న నీట్‌ మార్కులు వెబ్‌సైట్లో ఉంచండి.. ఎన్టీయేకి సుప్రీం కోర్టు ఆదేశం
NEET 2024 Exam Result
Follow us on

న్యూఢిల్లీ, జులై 19: నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై భారత సర్వోన్నత న్యాయస్థానం జులై 18న పిటిషన్లను విచారించింది. పరీక్ష కేంద్రం, నగరాల వారీగా అభ్యర్ధుల మార్కులకు సంబంధించిన ఫలితాలు ప్రకటించాలని ఎన్‌టీఏను ఆదేశించింది. జులై 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు మార్కుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని పేర్కొంది. పరీక్ష ప్రక్రియ, సమగ్రతను పారదర్శకతను నిర్ధారించడానికి కేంద్రాల వారీగా మార్కుల నమూనాలను వెల్లడించాలని, అయితే విద్యార్ధుల గుర్తింపును గోప్యంగా ఉంచాలని ధర్మాసనం సూచించింది. ‘నీట్‌- యూజీ’ సంబంధిత పిటిషన్‌లను జులై 22న తిరిగి విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది.

విచారణ సందర్భంగా సీజేఐ చంద్రచూడ్‌ గత 3 సంవత్సరాలుగా నీట్‌ పరీక్ష రాసిన విద్యార్ధుల సంఖ్య, ఉత్తీర్ణత వివరాలపై ప్రశ్నలు సంధించారు. 2022లో 17,64,570 మంది, 2023లో 20,38,526 మంది, 2024లో 23,33,297 మంది హాజరయ్యారు. 2022తో పోల్చితే దాదాపు 33 శాతం మంది అధికంగా 2024లో పరీక్షకు హాజరయ్యారు. అలాగే టాప్‌ స్కోర్‌లోనూ గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. 550-720 మార్కుల స్కోర్‌ చేసే అభ్యర్ధుల సంఖ్య కూడా 5 రెట్లు పెరిగిందని సీనియర్‌ న్యాయవాది నరేంద్ర హుడా విచారణ సమయంలో ఎత్తి చూపారు. ఇది పేపర్‌ లీకేజీని సూచించగలదా అని సీజేఐ చంద్రచూద్‌ ఆయనను ప్రశ్నించారు. హుడా సమాధానం చెబుతూ.. దీనిని రెడ్‌ ఫ్లాగ్‌గా పరిగణించి, తదుపరి విచారణను అభ్యర్ధించారు.

అలాగే పిటిషనర్లకు వచ్చిన కనీస మార్కులపై సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. సొలిసిటర్ జనరల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం కేవలం131 మంది విద్యార్థులు మాత్రమే నీట్‌ రీ-టెస్ట్‌ కోరుతున్నట్లు సమాచారం. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు నిరూపితం అయితే తప్ప.. రీటెస్ట్ పెట్టేందుకు ఆదేశించలేమని కోర్టు వెల్లడించింది. పలు అంశాలపై చర్చించిన ధర్మాసనం తదుపరి విచారణను జులై 22వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజు తీర్పు కూడా వెలువడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ 2024 ప్రాథమిక కీ విడుదల.. డైరెక్ట్ లింక్‌ ఇదే

కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 3,712 పోస్టుల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ ఎగ్జామినేషన్‌ 2024 (టైర్‌-1)కు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదలైంది. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ 2024 పరీక్ష ఆన్‌లైన్‌లో జులై 1 నుంచి 11 వరకు దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు తమ రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ నమదు చేసి సమాధానాల కీ, రెస్పాన్స్‌ షీట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కీపై అభ్యంతరాలు లేవనెత్తేవారు రూ.100 రుసుముతో జులై 23వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాలని తెలిపింది.

ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ 2024 ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.