AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Mains 2025 Application: జేఈఈ మెయిన్ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో కొత్త చిక్కు.. తలపట్టుకుంటున్న విద్యార్ధులు

జేఈఈ మెయిన్ 2025 తొలి విడత ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది ఎన్టీయే తీరు ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. దరఖాస్తు ప్రక్రియలో పలు రకాల కొర్రీలు పెట్టి విద్యార్ధులను ఇబ్బంది పెడుతుంది. దీంతో ఎన్టీయేకు వరుస ఫిర్యాదులు చేరుతున్నాయి..

JEE Mains 2025 Application: జేఈఈ మెయిన్ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో కొత్త చిక్కు.. తలపట్టుకుంటున్న విద్యార్ధులు
JEE Mains 2025
Srilakshmi C
|

Updated on: Nov 08, 2024 | 7:28 AM

Share

హైదరాబాద్‌, నవంబర్‌ 8: జేఈఈ మెయిన్ దరఖాస్తులో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) విద్యార్ధులను పలు ఇబ్బందులు పెడుతుంది. పలు రకాల కొర్రీలు పెట్టి విద్యార్ధులకు మానసిక క్షోభను కలిగిస్తుంది. తాజాగా జేఈఈ మెయిన్‌ 2025 తొలివిడత నోటిఫికేషన్‌ విడుదలవగా… దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 22, 2024 వరకు కొనసాగనుంది. అయితే ఈసారి జేఈఈ మెయిన్‌ దరఖాస్తు విధానంలో ఎన్టీఏ కొన్ని కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకూ జేఈఈ మెయిన్‌ పరీక్షలు రాసే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ-నాన్‌ క్రీమిలేయర్‌ (ఎన్‌సీఎల్‌), ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు తమకు రిజర్వేషన్‌ వర్తిస్తుందని డిక్లరేషన్‌ ఫాంపై టిక్‌ పెట్టి దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉండేది. కానీ ఈసారి ఆ నిబంధనను మార్చి దరఖాస్తు సమయంలోనే సర్టిఫికెట్‌ సంఖ్య, దాన్ని ఎవరు ఇచ్చారు.. ఏ తేదీన ఇచ్చారు.. వంటి పలు వివరాలు పేర్కొనాలని ఎన్‌టీఏ తెలిపింది. దీంతో ఇప్పటికిప్పుడు వాటిని ఎక్కడనుంచి తీసుకురావాలని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఎస్సీ, ఎస్టీ ధ్రువపత్రాలకు ఎలాంటి కాలపరిమితి లేదు. అవి ఒకసారి తీసుకుంటే ఎన్నేళ్లయినా వినియోగించుకోవచ్చు. ఇక ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-ఎన్‌సీఎల్‌ సర్టిఫికెట్లను మాత్రం కుటుంబ వార్షిక ఆదాయం ప్రకారం ఇస్తారు. కుటుంబ ఆదాయం ప్రతి సంవత్సరం మారే అవకాశం ఉన్నందున అవి ఒక ఏడాదికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి. దీంతో ఈ కోటా కింద సీటు పొందాలంటే ఏప్రిల్‌ 1 తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ మాత్రమే చెల్లుబాటవుతాయి. ఇప్పుడు ఆ సర్టిఫికెట్‌ తీసుకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 తర్వాత మళ్లీ తీసుకోవాల్సి వస్తుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎన్‌టీఏకు విద్యార్ధులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై ఎన్‌టీఏ స్పందించి తుది నిర్ణయంలో మార్పులు ఏమైనా చేస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు. ఆయా విద్యార్థులు ధ్రువపత్రాలకు దరఖాస్తు చేసి నంబరు తీసుకొని సిద్ధంగా ఉండాలని, కొద్ది రోజుల తర్వాత జేఈఈకి దరఖాస్తు చేయాలని కళాశాలలు, శిక్షణ సంస్థల నిర్వాహకులు సూచిస్తున్నారు.

మరోవైపు జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సర్టిఫికెట్లలో పేర్ల తేడా ఉంటే వారి దరఖాస్తులను కూడా ఎన్టీయే స్వీకరించలేదు. పదో తరగతి లేదా ఇంటర్‌ సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డులపై పేర్లలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తును నిరాకరిస్తూ వచ్చింది. విద్యా ధ్రువపత్రాలపై ఇంటిపేరు పూర్తిగా ఉండి… ఆధార్‌లో సంక్షిప్త రూపంలో ఉన్నాసరే దరఖాస్తు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఫిర్యాదులు రావడతో ఎన్టీయే దిగొచ్చింది. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి, పేర్లు మిస్‌మ్యాచ్‌ అయినట్లు చూపితే ఆ విండోను మూసివేస్తే కొత్త విండో ఓపెన్‌ అవుతుందని.. అప్పుడు ఆధార్‌ కార్డుపై ఉన్నట్లు వివరాలు నమోదు చేస్తే సరిపోతుందని ఎన్‌టీఏ స్పష్టంచేసింది. సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డుపై ఉన్న రెండు పేర్లను పరిగణనలోకి తీసుకొని దరఖాస్తు స్వీకరిస్తామని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.