IDBI Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంకు కొలువులు.. ఐడీబీఐ బ్యాంకులో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి శుభవార్త.. ఐడీబీఐ బ్యాంకులో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు..

IDBI Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంకు కొలువులు.. ఐడీబీఐ బ్యాంకులో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
IDBI Bank Jobs
Follow us

|

Updated on: Nov 08, 2024 | 6:24 AM

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్‌ లిమిటెడ్‌).. 2025-26 ఆర్థిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1000 ఎగ్జిక్యూటివ్ (సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు నవంబర్‌ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

యూఆర్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 448 ఎస్టీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 94 ఎస్సీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 127 ఓబీసీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 231 ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 100

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కంప్యూటర్, ఐటీ సంబంధిత అంశాల్లో నైపుణ్యం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి అక్టోబర్‌ 01, 2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు నవంబర్‌ 16, 2024వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.1050, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష డిసెంబర్‌ 1, 2024 నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైన వారికి నెలకు నెలకు రూ.29,000 నుంచి రూ.31,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

రాత పరీక్ష విధానం..

మొత్తం 200 ప్రశ్నలకు మార్కులు 200 కేటాయిస్తారు. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్ విభాగం నుంచి 60 మార్కులకు 60 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో 40 మార్కులకు 40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం నుంచి 40 మార్కులకు 40 ప్రశ్నలు, జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్/ ఐటీ/ కంప్యూటర్ విభాగంలో 60 మార్కులకు 60 ప్రశ్నలు చొప్పున వస్తాయి. పరీక్ష కాల వ్యవధి 120 నిమిషాలు.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..