TG TET 2024 Application: ఇవాళ్టి నుంచి ‘టెట్‌’ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. వారికి ఉచితంగా అప్లై చేసుకునే ఛాన్స్!

తెలంగాణ టెట్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విద్యాశాఖ ప్రకటన మేరకు నవంబర్ 7వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తు విధానం అందుబాటులోకి రానుంది. అయితే కొంత మందికి ఈ టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది రాష్ట్ర సర్కార్..

TG TET 2024 Application: ఇవాళ్టి నుంచి 'టెట్‌' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. వారికి ఉచితంగా అప్లై చేసుకునే ఛాన్స్!
TG TET 2024 Application
Follow us

|

Updated on: Nov 07, 2024 | 10:45 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 7: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2024) 2024 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే. టెక్నికల్ ప్రాబ్లెం వల్ల టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు విండో ఓపెన్‌ చేయలేకపోతున్నామని పాఠశాల విద్యాశాఖ వివరణ ఇచ్చింది. అయితే ఈ సాంకేతిక లోపాన్ని సరిచేసి.. నవంబర్ 7 నాటికి టెట్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తామని కూడా చెప్పింది. ఈ రోజైనా టెట్‌ అప్లికేషన్‌ విండో అందుబాటులోకి వస్తుందో.. రాదోనని అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి నవంబర్ 5న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నా.. అది గురువారానికి వాయిదా పడింది. ఒకవేళ నవంబర్‌ 7వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైతే ఇదే నెల 20వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక టెట్‌ ఆన్‌లైన్‌ పరీఓలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

ఈ ఏడాది జరిగిన తొలి టెట్‌ పరీక్షకు దరఖాస్తు ఫీజును రూ.400ల నుంచి రూ.1000కి విద్యాశాఖ పెంచింది. దీంతో దరఖాస్తు ఫీజు తగ్గించాలని కోరుతూ అభ్యర్థులు ఆందోళనలు చేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఫీజు తగ్గించలేమని అన్నారు. అయితే ఈ టెట్‌లో అర్హత సాధించని వారు వచ్చేసారి జరిగే పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని అప్పట్లో ప్రకటించారు. గత టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 2.35 లక్షల మంది పరీక్ష రాయగా.. వారిలో 1.09 లక్షల మంది పాసయ్యారు. అంటే దాదాపు 1.26 లక్షల మంది ఉత్తీర్ణులు కాలేదన్నమాట. వారంతా ఈసారి టెట్‌కు ఎలాంటి దరఖాస్తు చేసుకుంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే కొత్తగా పరీక్ష రాసేవారు మాత్రం రూ.వెయ్యి ఫీజును తగ్గించాలని కోరుతున్నారు. దీనిపై రేవంత్ సర్కార్‌ ఏవిధంగా స్పందిస్తుందనేది చూడాలి..

కాగా టెట్‌లో మొత్తం రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్ 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఓసీలకు 90, బీసీ 75, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే టెట్‌లో ఉత్తీర్ణులవుతారు. టెట్‌లో అర్హత సాధించిన వారికి మాత్రమే డీఎస్సీ రాసేందుకు అవకాశం ఉంటుంది. పైగా టెట్‌లో వచ్చిన మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఇస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నేడే TET దరఖాస్తుప్రక్రియ ప్రారంభం..వారు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు
నేడే TET దరఖాస్తుప్రక్రియ ప్రారంభం..వారు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు
భద్రకాళి అమ్మవారి సన్నిధిలో రాకింగ్ రాకేష్ కూతురి నామకరణ మహోత్సవం
భద్రకాళి అమ్మవారి సన్నిధిలో రాకింగ్ రాకేష్ కూతురి నామకరణ మహోత్సవం
స్టార్ దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సూర్య ఫ్యాన్స్..
స్టార్ దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సూర్య ఫ్యాన్స్..
అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గని దక్ష నాగర్కర్..
అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గని దక్ష నాగర్కర్..
కవల ఆడపిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. పిల్లల్ని చూడగానే అరుపులు...
కవల ఆడపిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. పిల్లల్ని చూడగానే అరుపులు...
భార్య ముందు ‘అంకుల్‌’ అన్నందుకు షాప్ ఓనర్‌ను చితక్కొట్టిన కస్టమర్
భార్య ముందు ‘అంకుల్‌’ అన్నందుకు షాప్ ఓనర్‌ను చితక్కొట్టిన కస్టమర్
చిరంజీవికి భార్యగా, సిస్టర్‌గా చేసిన యంగ్ బ్యూటీ..
చిరంజీవికి భార్యగా, సిస్టర్‌గా చేసిన యంగ్ బ్యూటీ..
నాగ చైతన్య- శోభితల పెళ్లి పనుల ఫొటోలు షేర్ చేసిన సమంత
నాగ చైతన్య- శోభితల పెళ్లి పనుల ఫొటోలు షేర్ చేసిన సమంత
బోరుగడ్డకు బిర్యానీతో విందు.. ఏడుగురు పోలీసులు సస్పెండ్‌
బోరుగడ్డకు బిర్యానీతో విందు.. ఏడుగురు పోలీసులు సస్పెండ్‌
డబ్బుకి ఇబ్బందులా.. ఉత్థాన ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి
డబ్బుకి ఇబ్బందులా.. ఉత్థాన ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి