Constable Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. వారం రోజుల్లో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

|

Aug 21, 2024 | 7:24 AM

నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త. దేశంలోని బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టుల భర్తీకి త్వరలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (జీడీ) నియామకాలకు సన్నాహాలు చేస్తుంది. 2024-25 ఎస్‌ఎస్‌సీ వార్షిక క్యాలెండర్‌ ప్రకారం..

Constable Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. వారం రోజుల్లో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
SSC GD Constable
Follow us on

న్యూఢిల్లీ, ఆగస్టు 21: నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త. దేశంలోని బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టుల భర్తీకి త్వరలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (జీడీ) నియామకాలకు సన్నాహాలు చేస్తుంది. 2024-25 ఎస్‌ఎస్‌సీ వార్షిక క్యాలెండర్‌ ప్రకారం ఆగస్టు 27న నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 5వ తేదీతో ముగుస్తుంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరగుతాయి. కాగా గతేడాది 46,617 పోస్టులను భర్తీ చేయగా.. ఈ ఏడాది సైతం భారీ సంఖ్యలోనే పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పదో తరగతి అర్హతతోపాటు పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకుండా ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఈ అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. రాత పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.https://ssc.gov.in/

ఆగస్టు 27న ఏపీ అగ్రిసెట్‌ పరీక్ష.. వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు

ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అగ్రిసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ పరీక్ష వివరాలను వెల్లడించింది. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 268 బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ డిగ్రీ సీట్లు భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పేమెంట్‌ ఐడీ, రిజిస్ట్రేషన్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆగస్టు 27వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.

ఏపీ అగ్రిసెట్‌ హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఎస్‌ఎస్‌సీ జూనియర్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌ ఫలితాలు వచ్చేశాయ్‌..

జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీల భర్తీకి నిర్వహించిన పేపర్‌-1 రాత పరీక్ష ఫలితాలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది. పేపర్‌-1లో మొత్తం 16,223 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరంతా పేపర్‌-2 పరీక్ష రాయొచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్‌-బి1,765 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో ఉద్యోగాలు కల్పిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎస్‌ఎస్‌సీ జూనియర్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌-2024 పేపర్‌-1 జాబితా-1 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎస్‌ఎస్‌సీ జూనియర్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌-2024 పేపర్‌-1 జాబితా-2 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.