
హైదరాబాద్, డిసెంబర్ 31: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి (గ్రూప్ సి) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ రాత పరీక్షలు కూడా ఇప్పటికే ముగిశాయి. తాజాగా తుది దశ అయిన స్కిల్ టెస్ట్ షెడ్యూల్‌ను ఎస్‌ఎస్‌సీ విడుదల చేసింది. తాజా షెడ్యూల ప్రకారం జనవరి 28, 29 తేదీల్లో స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. స్కిల్ టెస్ట్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాతోపాటు రిజర్వేషన్ ఆధారంగా కటాఫ్ మార్కులను ఇటీవలే కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం స్కిల్ టెస్ట్‌కు గ్రేడ్-సికు మొత్తం 8,624 మంది, గ్రేడ్-డికు మొత్తం 22,456 మంది అర్హత సాధించారు.
కాగా ఈ పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 6, 7, 8, 11 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. స్కిల్ టెస్ట్ అనంతరం మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. కాగా ఎస్‌ఎస్‌సీ ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 261 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ పోస్టుల స్కిల్ టెస్ట్ షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్-డిసెంబర్ 2025 పరీక్షల ప్రాథమిక కీ తాజాగా విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ మేరకు ఆన్సర్ కీ తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను అభ్యర్థులు జనవరి 1, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో సమర్పించవచ్చు.
సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్-డిసెంబర్ 2025 పరీక్షల ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.