SSC Govt Jobs 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌.. భారీగా పెరిగిన పోస్టుల సంఖ్య

SSC Stenographer Vacancies: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త తెలిపింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’, గ్రేడ్ ‘డి’ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో ప్రకటించిన 731 ఖాళీల సంఖ్యను పెంచుతూ తాజా సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్‌ 4 నాటికి మొత్తం 1,170 ఖాళీలు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగార్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. ఈ నియామకాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), అనంతరం స్కిల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నారు. జులై-ఆగస్టు నెలల్లో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు సిద్ధతను మరింత వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు..

SSC Govt Jobs 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌.. భారీగా పెరిగిన పోస్టుల సంఖ్య
SSC Stenographer Vacancies

Updated on: Jun 05, 2026 | 4:07 PM

హైదరాబాద్, జూన్ 5: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల్లో 2026 సంవత్సరానికి గాను స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’, గ్రేడ్‌ ‘డి’ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన ప్రకటన మేరకు మొత్తం 731 పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులను పెంచిన కేంద్ర ప్రభుత్వం సవరించిన మొత్తం పోస్టులతో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ప్రకటన మేరకు జూన్‌ 4వ తేదీ నాటికి మొత్తం 1170 పోస్టులు ఉన్నట్లు తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారం స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జులై నుంచి ఆగస్టు మధ్య నెలల్లో జరగనున్నాయి. సీబీటీ కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది.

ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ ఆన్‌లైన్‌ రాత పరీక్ష (CBT) మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ విభాగం నుంచి 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్ విభాగం నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. 2 గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున కోత విధిస్తారు. ఆన్‌లైన్‌ రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి అభ్యర్థి ఎంచుకున్న దాని ప్రకారం హిందీ లేదా ఇంగ్లిష్‌లో స్టెనోగ్రఫీ పరీక్ష ఉంటుంది. గ్రేడ్ ‘C’ కు నిమిషానికి 100 పదాలు, గ్రేడ్ ‘D’ కు 80 పదాల వేగంతో ఉండాలి. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత తుది ఎంపికకు సంబంధించిన మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us