కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. 12,523 ఎమ్‌టీఎస్ (నాన్ టెక్నికల్), హవల్దార్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 17, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాతపరీక్ష/ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఏప్రిల్ 2023 నెలలో నెర్వహిస్తారు. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
మొత్తం 90 ప్రశ్నలకు 270 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. గంటన్నర సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ప్రశ్నాపత్రంలో రెండు సెక్షన్‌లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో రెండు విభాగాలు ఉంటాయి.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.