SSC Recruitment: భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎస్‌ఎస్‌సీ.. పూర్తి వివరాలు..

SSC Recruitment: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏకంగా 3603 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో మల్టీ టాస్కింగ్‌, హవల్దార్‌ పోస్టులు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

SSC Recruitment: భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎస్‌ఎస్‌సీ.. పూర్తి వివరాలు..
Ssc Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 29, 2022 | 4:19 PM

SSC Recruitment: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏకంగా 3603 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో మల్టీ టాస్కింగ్‌, హవల్దార్‌ పోస్టులు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మల్టీ టాస్కింగ్‌(నాన్‌ టెక్నికల్‌), హవల్దార్‌(సీబీఐసీ అండ్‌ సీబీఎన్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో హవల్దార్‌ (సీబీఐసీ అండ్‌ సీబీఎన్‌) – 3603 ఖాళీలు ఉండగా, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ పోస్టులను త్వరలోనే ప్రకటించనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్‌(పదో తరగతి) పరీక్ష/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

* అభ్యర్థుల వయసు 01-01-2022 నాటికి 18–25 ఏళ్లు, 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కంప్యూటర్‌ బేస్డ్‌ రాతపరీక్ష (పేపర్‌–1, పేపర్‌–2), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌(పీఈటీ)/ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ) ఆధారంగా ఎంపికచేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 30-04-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షను (టైర్‌–1): జూలై 2022లో నిర్వహిస్తారు. టైర్‌–2 (డిస్క్రిప్టివ్‌ పేపర్‌) తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

పరీక్షా విధానం ఇలా ఉంటుంది..

పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌ 1 అబ్జెక్టివ్‌ విధానంలో, పేపర్‌ – 2ని డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. సబ్జెక్టుల విషయానికొస్తే జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ అవేర్‌నెస్‌ ఉంటాయి. 90 నిమిషాల నిడివి ఉండే పరీక్షలో నెగిటివ్‌ మార్కింగ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉండే పేపర్‌ 2ను 50 మార్కులకు నిర్వహిస్తారు. షార్ట్‌ ఎస్సే/లెటర్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ రాయాల్సి ఉంటుంది. పరీక్షా సమయం 45 నిమిషాలు ఉంటుంది.

Also Read: China plane crash: చైనా విమాన ప్రమాదంలో సిబ్బందితో సహా 132 మంది మృతి! ఆ 2 బాక్సుల ఆధారంగానే నిజానిజాలు తేల్చలేం..

Viral Video: అమ్మో..! ఇదేం పిల్లి రా.. బాబు అదరిపోయే వంటలు చేస్తోంది.. గుటకలేస్తున్న జనం..

IPL 2022: బీసీసీఐ సంచలన నిర్ణయం.. అమలులోకి న్యూ రూల్స్.! ఆ విదేశీ క్రికెటర్లకు దిమ్మతిరిగే షాక్..