RBI Recruitment: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
RBI Recruitment: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
RBI Recruitment: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 303 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో గ్రేడ్ బీ ఆఫీసర్లు(జనరల్)–238, గ్రేడ్ బీ ఆఫీసర్లు(ఎకనమిక్ అండ్ పాలిసీ రీసెర్చ్ విభాగం(డీఈపీఆర్)–31, గ్రేడ్ బీ ఆఫీసర్లు(స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ విభాగం(డీఎస్‌ఐఎం)–25, అసిస్టెంట్ మేనేజర్లు (రాజ్‌భాష)–06, అసిస్టెంట్ మేనేజర్లు(ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ)–03 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 28-03-2022న ప్రారంభం కాగా, చివరి తేదీగా 18-04-2022ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Food Knowledge: ఎక్స్పైరీ డేట్ లేని ఆహార పదార్థాలు ఎంటో తెలుసా.. తేనే నుంచి బియ్యం వరకు..
RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే సీతక్క.. అలా అనుకుంటేనే సినిమా చూడాలంటూ..
Aadhaar Card: పాస్‌పోర్టు ఉంటే వారు కూడా ఆధార్ కార్డు పొందవచ్చు..!