SSC GD Constable Recruitment 2022: పదో తరగతి అర్హతతో.. 24,369 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎస్సెస్సీ నోటిఫికేషన్‌ విడుదల..

|

Oct 28, 2022 | 11:40 AM

భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌.. 24,369 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి..

SSC GD Constable Recruitment 2022: పదో తరగతి అర్హతతో.. 24,369 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎస్సెస్సీ నోటిఫికేషన్‌ విడుదల..
Follow us on

భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌.. 24,369 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్‌)లలో.. కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ)లో సిపాయి పోస్టులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేయనుంది. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన మహిళా/పురుష అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెంటీమీటర్లకు, మహిళా అభ్యర్థులకు 157 సెంటీమీటర్లకు తగ్గకుండా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 2000 కంటే ముందు జవనరి 1, 2005 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.100 అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ప్రతిభకనబరచిన వారికి సిపాయి పోస్టులకైతే నెలకు రూ.18,000ల నుంచి రూ.56,900 వరకు, ఇతర పోస్టులకు రూ.21,700ల నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) పోస్టులు: 10497
  • సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్‌) పోస్టులు: 100
  • సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్‌) పోస్టులు: 8911
  • సశస్త్ర సీమ బల్(ఎస్‌ఎస్‌బీ) పోస్టులు: 1284
  • ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) పోస్టులు: 1613
  • అస్సాం రైఫిల్స్(ఏఆర్‌) పోస్టులు: 1697
  • సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్‌ఎస్‌ఎఫ్‌) పోస్టులు: 103
  • నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) పోస్టులు: 164

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 30, 2022.
  • ఆఫ్‌లైన్ చలానా చెల్లింపులకు చివరి తేదీ: నవంబర్‌ 30, 2022.
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: డిసెంబర్ 1, 2022.
  • చలాన్ ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: డిసెంబర్ 1, 2022.
  • రాత పరీక్ష తేదీ: జనవరి, 2023.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.