AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constable Physical Test: కానిస్టేబుల్ పోస్టులకు దేహదారుఢ్య పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి తుది అంకం మొదలైంది. దేహ దారుఢ్య సామర్థ్య పరీక్ష మరో 10 రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో పరీక్ష తేదీలతో పాటు అడ్మిట్‌కార్డులను స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఈ మేరకు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్సు (CRPF) అధికారిక ప్రకటన జారీ చేసింది. దేహ దారుఢ్య సామర్థ్య పరీక్ష దేశవ్యాప్తంగా..

Constable Physical Test: కానిస్టేబుల్ పోస్టులకు దేహదారుఢ్య పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే
Constable Physical Tests
Srilakshmi C
|

Updated on: Sep 12, 2024 | 6:48 AM

Share

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 12: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి తుది అంకం మొదలైంది. దేహ దారుఢ్య సామర్థ్య పరీక్ష మరో 10 రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో పరీక్ష తేదీలతో పాటు అడ్మిట్‌కార్డులను స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఈ మేరకు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్సు (CRPF) అధికారిక ప్రకటన జారీ చేసింది. దేహ దారుఢ్య సామర్థ్య పరీక్ష దేశవ్యాప్తంగా 105 పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. సెప్టెంబర్‌ 23 నుంచి ఫిజికల్‌ టెస్టులు ప్రారంభం అవుతాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) నిర్వహిస్తారు. పీఈటీ, పీఎస్‌టీ పాసైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు.

దీంతో నియామక ప్రక్రియకు సంబంధించిన మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం రిజర్వేషన్‌ వారీగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. గతేడాది విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 46,617 కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ)/ రైఫిల్‌మ్యాన్(జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగాయి. ఏప్రిల్‌లో ఆన్సర్‌ కీ విడుదల చేయగా.. దీనిపై అభ్యంతరాల స్వీకరణ పూర్తి చేసి, జులైలో రాత పరీక్ష ఫలితాలు విడుదల చేసింది.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు..

  • బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)లో పోస్టులు: 12,076 (పురుషులు- 10227, మహిళలు- 1849)
  • సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్‌) పోస్టులు: 13,632 (పురుషులు- 11,558, మహిళలు- 2,074)
  • సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్‌) పోస్టులు: 9,410 (పురుషులు- 9301, మహిళలు- 109)
  • సశస్త్ర సీమ బల్(ఎస్‌ఎస్‌బీ) పోస్టులు: 1,926 (పురుషులు- 1884, మహిళలు- 42)
  • ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) పోస్టులు: 6,287 (పురుషులు- 5327, మహిళలు- 960)
  • అస్సాం రైఫిల్స్(ఏఆర్‌) పోస్టులు: 2,990 (పురుషులు- 2948, మహిళలు- 42)
  • సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్‌ఎస్‌ఎఫ్‌) పోస్టులు: 296 (పురుషులు- 222, మహిళలు- 74)

స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ పీఈటీ/ పీఎస్‌టీ అడ్మిట్‌కార్డు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు