SSC GD Constable: రేపే కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చేది.. రాత పరీక్ష ఎప్పుడంటే

|

Aug 26, 2024 | 4:24 PM

దేశ రక్షణ దళంలో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మంగళవారం (ఆగస్టు 27) నోటిఫికేషన్‌ విడుదలకానుంది. వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (జీడీ) నియామకాల ప్రక్రియకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) ఏర్పాట్లు చేస్తుంది. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), ఎన్‌సీబీలో సిపాయి పోస్టులను..

SSC GD Constable: రేపే కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చేది.. రాత పరీక్ష ఎప్పుడంటే
SSC GD Constable Jobs
Follow us on

దేశ రక్షణ దళంలో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మంగళవారం (ఆగస్టు 27) నోటిఫికేషన్‌ విడుదలకానుంది. వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (జీడీ) నియామకాల ప్రక్రియకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) ఏర్పాట్లు చేస్తుంది. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), ఎన్‌సీబీలో సిపాయి పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనుంది. ఎస్‌ఎస్‌సీ వార్షిక క్యాలెండర్‌ 2024-25 ప్రకారం ఆగస్టు 27న (మంగళవారం) ఈ నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 5వ తేదీతో ముగుస్తుంది. వచ్చే ఏడాది (2025) జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరుగుతాయి. గతేడాది 46,617 ఖాళీల నియామక ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సైతం ఎక్కువ సంఖ్యలోనే పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా సాయుధ బలగాల్లో ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతిలో పాసై ఉంటే సరిపోతుంది. అలాగే పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెంటీ మీటర్లకు, మహిళా అభ్యర్థులకు 157 సెంటీమీటర్లకు తగ్గకుండా ఉండాలి. అభ్యర్థులు వయసు తప్పనిసరిగా 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల చొప్పున సడలింపు ఉంటుంది.

రాత పరీక్ష ఎలా ఉంటుందంటే..

రాత పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ప్రశ్నపత్రం మొత్తం 80 మార్కులకు ఉంటుంది. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌, ఇంగ్లిష్‌/ హిందీ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.