AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC GD Constable Exam Date: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కానిస్టేబుల్ కొలువులకు పరీక్ష తేదీలు విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) గతేడాది నవంబర్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్‌ 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు తాజాగా రాత పరీక్ష తేదీలను కమిషన్‌ విడుదల..

SSC GD Constable Exam Date: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కానిస్టేబుల్ కొలువులకు పరీక్ష తేదీలు విడుదల
SSC GD Constable Exam Date
Srilakshmi C
|

Updated on: Mar 30, 2023 | 1:04 PM

Share

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) గతేడాది నవంబర్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్‌ 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు తాజాగా రాత పరీక్ష తేదీలను కమిషన్‌ విడుదల చేసింది. పదో తరగతి విద్యార్హత కలిగిన ఈ ఉద్యోగాలకు ఇప్పటికే బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు, ఎన్‌సీబీలో సిపాయి పోస్టులకు జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి.

తాజాగా సీఆర్‌పీఎఫ్‌ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తాత్కాలిక పరీక్ష తేదీలను ప్రకటించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పీఎస్‌టీ/ పీఈటీలను ఏప్రిల్‌ 14 తర్వాత నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. అడ్మిట్ కార్డు ఎప్పటి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చనేది వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెల్పింది. శారీరక సామర్థ్య పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. తుది ఫలితాల అనంతరం రిజర్వేషన్‌ ఆధారంగా సాయుధ బలగాల్లో ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఇతర పరీక్షల తేదీలు..

  • మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ ఎగ్జామ్‌-2022ను మే 2 నుంచి 19 వరకు, జూన్‌ 13 నుంచి 20 వరకు
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(దిల్లీ పోలీస్‌), సీఆర్‌పీఎఫ్‌-2022(టైర్‌-2) పరీక్షలు మే 2
  • కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ ఎగ్జామ్‌-2022(టైర్‌-2) పరీక్ష జూన్‌ 26
  • సెలెక్షన్‌ పోస్ట్‌ ఎగ్జామ్‌-2023 జూన్‌ 27 నుంచి 30 వరకు
  • కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఎగ్జామ్‌-2023 (టైర్‌-1)ను జులై 14 నుంచి 27 వరకు

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
బాలకృష్ణ, చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా..
బాలకృష్ణ, చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా..