SSC Head Constable Jobs 2022: నేటితో ముగుస్తున్న ఎస్సెస్సీ 835 హెడ్ కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ..

భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్‌ 2022 కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే ఆఖరు. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ రోజు రాత్రి..

SSC Head Constable Jobs 2022: నేటితో ముగుస్తున్న ఎస్సెస్సీ 835 హెడ్ కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ..
Ssc Delhi Police
Follow us

|

Updated on: Jun 16, 2022 | 7:42 AM

SSC Delhi Police Head Constable Recruitment 2022: భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్‌ 2022 కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే ఆఖరు. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ రోజు రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే అర్హత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్ధులను హెడ్‌ కానిస్టేబుల్‌ (Ministerial Head Constable) పోస్టులకు ఎంపికవుతారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం క్లుప్తంగా మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టులు: 835

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌)

ఖాళీల వివరాలు:

  • హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌-పురుషులు) పోస్టులు: 559
  • హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌-మహిళలు) పోస్టులు: 276

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు 25,500ల నుంచి 81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఇంటర్మీడియట్‌ (10+2) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. అలాగే ఇంగ్లిష్‌ లేదా హిందీ టైపింగ్‌ స్పీడ్‌ వచ్చి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (CBT), ఫిజికల్‌ టెస్ట్స్‌, టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: రాత పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. 90 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ హిందీ, ఇంగ్లిష్‌ మీడియంలో మాత్రమే ఉంటుంది.

విభాగాల వారీగా ప్రశ్నలు:

  • జనరల్‌ అవేర్‌నెస్‌లో 20 ప్రశ్నలకు 20 మార్కులు
  • క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 20 ప్రశ్నలకు 20 మార్కులు
  • జనరల్‌ ఇంటెలిజెన్స్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు
  • ఇంగ్లిష్‌ లంగ్వేజ్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు
  • కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు

దరఖాస్తు విధానం: ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్థులకు: రూ.100
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 16, 2022 (అర్థ రాత్రి 23:00 గంటల వరకు)

రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్‌, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి. https://ssc.nic.in లేదా https://delhipolice.gov.in

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!