భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 20,000 పోస్టులను కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2022 ద్వారా భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 8తో ముగిసింది. ఐతే తాజాగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువును అక్టోబర్ 13వ తేదీ వరకు పొడిగిస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అప్లై చేసుకోవడానికి మరో అవకాశం లభించింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా గ్రూప్ సీ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, గ్రూప్ బీ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష (టైర్-I, టైర్-II) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. టైర్ -I పరీక్ష డిసెంబర్ 2022లో నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.29,200ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
రాత పరీక్ష విధానం: టైర్ -1 పరీక్ష 200 మార్కులకు గానూ 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. గంటలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.