SPA Recruitment 2022: రూ. 2 లక్షల జీతంతో స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా..

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌.. ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

SPA Recruitment 2022: రూ. 2 లక్షల జీతంతో స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా..
SPA New Delhi

Updated on: Oct 11, 2022 | 2:52 PM

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌.. 29 ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆర్కిటెక్చర్‌, ల్యాండ్‌ స్కేప్‌ ఆర్కిటెక్చర్‌, బిల్డింగ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌, హౌజింగ్‌, అర్బన్‌ డిజైన్‌, ఫిజికల్‌ ప్లానింగ్‌, ఇండస్ట్రియల్‌ డిజైన్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ/ పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు నోటిఫికేషన్‌ విడుదలైన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.2500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈడబ్ల్యూఎస్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.57,700ల నుంచి రూ.2,11,800ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: The Registrar, School of Planning and Architecture, 4, Block-B, Indraprastha Estate, New Delhi-110002.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.