SIDBI Recruitment 2022: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నో ఎగ్జాం..!
భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన లక్నో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI).. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ (Information Security Administrator Posts) పోస్టుల భర్తీకి
SIDBI Risk Officer Recruitment 2022: భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన లక్నో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI).. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ (Information Security Administrator Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 28
పోస్టుల వివరాలు: ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, కన్సల్టెంట్ ఇంజనీరి్, డేటా సైంటిస్ట్, రిస్క్ అనలిస్ట్, రిస్క్ ఆఫీసర్, ఫండ్ మేనేజర్, లీడ్ ఆఫీసర్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, లీడ్ స్పెషలిస్ట్, క్రెడిట్ అనలిస్ట్ తదితర పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ, బీఈ/బీటెక్/ఎంబీఏ/పీజీడీఎం/సీఏ/సీఎఫ్‌ఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మెయిల్ ఐడీ: recruitment.sidbi@gmail.com
దరఖాస్తులకు చివరి తేదీ: మే 21, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: