IDRBT Hyderabad Recruitment 2022: హైదరాబాద్‌ ఐడీఆర్‌బీటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

భారత ప్రభుత్వానికి చెందిన రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (IDRBT).. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌ 1, గ్రేడ్ 2) పోస్టుల (Assistant Professor Grade 1 & 2 posts) భర్తీకి..

IDRBT Hyderabad Recruitment 2022: హైదరాబాద్‌ ఐడీఆర్‌బీటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
Idrbt
Follow us

|

Updated on: May 13, 2022 | 11:38 AM

IDRBT Hyderabad Assistant Professor Grade 1 & 2 Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (IDRBT).. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌ 1, గ్రేడ్ 2) పోస్టుల (Assistant Professor Grade 1 & 2 posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌ 1, గ్రేడ్ 2) పోస్టులు

ఇవి కూడా చదవండి

విభాగాలు: ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీ, 5జీ అండ్‌ బియాండ్‌ నెట్‌వర్క్స్‌, క్వాంటమ్ కంప్యూటింగ్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీలో అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 55,000ల నుంచి 1,01,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Human Resources Department, IDRBT, Castle Hills, Road No.1, Masab Tank, Hyderabad – 57.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Also Read:

SIDBI Recruitment 2022: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నో ఎగ్జాం..!