Military Hospital Jobs: సికింద్రాబాద్‌ మిలటరీ హాస్పిటల్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

|

Jul 26, 2022 | 11:21 AM

Military Hospital Jobs: సికింద్రాబాద్‌లోని మిలటరీ హాస్పిటల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. పలు విభాగాల్లో ఉన్న మెడికల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?

Military Hospital Jobs: సికింద్రాబాద్‌ మిలటరీ హాస్పిటల్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Follow us on

Military Hospital Jobs: సికింద్రాబాద్‌లోని మిలటరీ హాస్పిటల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. పలు విభాగాల్లో ఉన్న మెడికల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి.

* వీటిలో చైల్డ్‌ సైకాలజిస్ట్‌/ పీడియాట్రిక్‌ కౌన్సెలర్‌, పీడియాట్రిక్‌ ఆడియాలజిస్ట్, స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ పాథాలజిస్ట్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌, ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ పీజీ పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని. అప్లికేషన్‌ ఫామ్‌ను ఈమెయిల్‌ లేదా ఆఫ్‌లైన్‌ విధానంలో పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను secunderabadmh@gmail.com ఐడీకి మెయిల్ చేయడం లేదా.. కమాండెంట్‌, మిలిటరీ హాస్పిటల్‌, సికింద్రాబాద్‌-500015 అడ్రస్‌కు పంపించాలి.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 20,000 నుంచి రూ. 35,000 వరకు చెల్లిస్తారు.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 05-08-2022ని నిర్ణయించారు. ఇంటర్వ్యూలను 07-08-2022న నిర్వహిస్తారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..