SCCL Recruitment: సింగరేని కాలరీస్‌లో మెడికల్ పోస్టులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. ఎవరు అర్హులంటే..
SCCL Recruitment: ది సింగరేని కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఈ సంస్థలో పలు ఖాళీలను...
SCCL Recruitment: ది సింగరేని కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఈ సంస్థలో పలు ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 30 జనరల్ మెడికల్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే రాష్ట్ర వైద్య మండలిలో నమోదు చేసుకొని ఉండాలి.
* అభ్యర్థుల వయసు 64 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్‌థులను నేరుగా ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఇంటర్వ్యూలను డైరెక్టర్, పీఏ అండ్ డబ్ల్యూ, ఎస్‌సీసీఎల్, ప్రధాన కార్యాలయం, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడ్రస్‌లో నిర్వహిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా 04-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు, ఇంటర్వ్యూలను 16-08-2022న నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 85,000 జీతంగా చెల్లిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..