SBI Admit Card: ప్రముఖ భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎస్‌బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ పోస్టులకు గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 13న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ.. మే 3న ముగిసింది. ఈ పోస్టులలో కొన్ని ప్రత్యేక కేడర్ ఆఫీసర్ పోస్టుల నియామకాలు రెగ్యులర్ ఉండగా, మరికొన్ని కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎస్‌బీఐ విడుదల చేసింది. ఆయా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఈ క్రమంలో ఎస్‌బీఐ ఎస్ఓ, ఫార్మసిస్ట్ పరీక్షలు మే 23న ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. పరీక్షలో సాధించిన మార్కులను బట్టి పర్సనల్ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. అనంతరం ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంచుకుంటారు. దరఖాస్తు చేసుకున్న తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, వరంగల్, హైదరాబాద్ పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ రాసుకునే వెసులుబాటు కల్పించారు.
* ఇందుకోసం ముందుగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ https://www.sbi.co.in/లోకి వెళ్లాలి.
* అనంతరం కెరీర్స్ ట్యాబ్‌లోకి వెళ్లాలి.
* తర్వాత ఎస్‌బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ అడ్మిట్ కార్డ్ అండ్ ఎస్‌బీఐ ఫార్మసిస్ట్ అడ్మిట్ కార్డు నోటిఫికేషన్‌పై క్లిక్ చేయాలి.
* అనంతరం ఓపెన్ అయిన లాగిన్ పేజీలో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
* వెంటనే అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోవాలి.