SBI SO Recruitment 2022: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 665 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలివే..

భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI).. 665 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల (Specialist Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

SBI SO Recruitment 2022: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 665 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలివే..
Sbi

Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:04 PM

SBI Specialist Officer Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI).. 665 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల (Specialist Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్, సెంట్రల్ ఆపరేషన్ టీమ్, ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్, రిలేషన్ షిప్ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, ఎస్ఆర్ రిలేషన్షిప్ మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్, రీజినల్ హెడ్, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్, సిస్టమ్ ఆఫీసర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌, ఎంబీఏ/పీజీడీఎమ్‌/పీజీ డిగ్రీ/ఐటీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 32 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు సెప్టెంబర్‌ 20, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులకు రూ.750లు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి