భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో1422 సర్కిల్ బేస్‌డ్ ఆఫీసర్ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ రోజు (నవంబర్ 7) ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు175 పోస్టుల వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు సెప్టెంబర్ 30, 2022వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.750లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష డిసెంబర్ 4, 2022వ తేదీన ఆయా పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ నెలాఖరులో హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఎంపికైన వారికి నెలకు రూ.63,840ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ విధానంలో జరిగే రాత పరీక్ష మొత్తం 120 మార్కులకు, 120 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 2 గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
డిస్క్రిప్టిప్ పేపర్‌లో రెండు ఎస్సేలకు 25 మార్కుల చొప్పున 50 మార్కులకు 30 నిముషాల్లో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.