AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SAIL Burnpur Recruitment 2022: సెయిల్- బర్న్‌పూర్ ఆసుపత్రిలో ట్రైనీ నర్సింగ్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ తేదీ ఇదే..

భారత ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన (SAIL) పశ్చిమ బెంగాల్‌లోని సెయిల్- బర్న్‌పూర్ ఆసుపత్రి (Burnpur Steel Plant).. 27 ప్రొఫీషియన్సీ ట్రైనీ (నర్సింగ్‌) పోస్టుల భర్తీకి..

SAIL Burnpur Recruitment 2022: సెయిల్- బర్న్‌పూర్ ఆసుపత్రిలో ట్రైనీ నర్సింగ్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ తేదీ ఇదే..
Sail
Srilakshmi C
|

Updated on: Aug 10, 2022 | 6:52 AM

Share

SAIL IISCO Steel Plant Nursing Staff Trainees Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన (SAIL) పశ్చిమ బెంగాల్‌లోని సెయిల్- బర్న్‌పూర్ ఆసుపత్రి (Burnpur Steel Plant).. 27 ప్రొఫీషియన్సీ ట్రైనీ (నర్సింగ్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంటర్మీడియట్‌తోపాటు బీఎస్సీ నర్సింగ్‌ లేదా డిప్లొమా ఇన్‌ జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఆగస్టు 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 16, 2022న ఉదయం 9 గంటలకు కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.8000ల వరకు స్టైపెండ్‌గా ఇస్తారు. ట్రైనింగ్‌ వ్యవధి 18 నెలల వరకు ఉంటుంది. రోజుకు 8 గంటల చొప్పున వారానికి 48 గంటల పాటు ట్రైనింగ్ ఉంటుంది.

అడ్రస్‌: Confluence, Opp. To Burnpur Post Office, Near Bharti Bhawan, Burnpur-713325, Dt: Paschim Bardhaman, West Bengal.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.