SAIL Bhilai Recruitment 2023: టెన్త్‌/డిగ్రీ అర్హతతో.. రాత పరీక్షలేకుండా భిలాయ్‌ స్టీల్ ప్లాంట్‌లో 120 ఉద్యోగాలు..

|

Jan 22, 2023 | 9:38 PM

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన భిలాయ్‌ స్టీల్ ప్లాంట్‌లో.. 120 గ్రాడ్యుయేట్‌/టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

SAIL Bhilai Recruitment 2023: టెన్త్‌/డిగ్రీ అర్హతతో.. రాత పరీక్షలేకుండా భిలాయ్‌ స్టీల్ ప్లాంట్‌లో 120 ఉద్యోగాలు..
SAIL Bhilai
Follow us on

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన భిలాయ్‌ స్టీల్ ప్లాంట్‌లో.. 120 గ్రాడ్యుయేట్‌/టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీఎస్‌/ఐటీ, సివిల్‌, మెటలర్జీ, ఎలక్ట్రికల్‌, మైనింగ్‌, మెకానికల్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు బీటెక్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులకు డిప్లొమాలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 19, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌/షార్ట్‌ లిస్టింగ్‌/డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నిబంధనల మేరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.