RRB: రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.. అడ్మిట్ కార్డులు ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా

|

Aug 14, 2022 | 3:55 PM

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఆర్ఆర్బీ కీలక అలర్ట్ ఇచ్చింది. గ్రూప్ - డి రిక్రూట్‌మెంట్ పరీక్షకు అడ్మిట్ కార్డును రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు RRB గ్రూప్ D- rrb.digialm.com అధికారిక...

RRB: రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.. అడ్మిట్ కార్డులు ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా
Group- 1
Follow us on

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఆర్ఆర్బీ కీలక అలర్ట్ ఇచ్చింది. గ్రూప్ – డి రిక్రూట్‌మెంట్ పరీక్షకు అడ్మిట్ కార్డును రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు RRB గ్రూప్ D- rrb.digialm.com అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్లి అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. 1,03,739 ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ పరీక్ష జరుగనుంది. ఆగస్టు 17, 2022 నుంచి పరీక్షలు జరగనున్నాయి. దీంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించి పరీక్ష వివరాలను తెలుసుకోవచ్చిని పేర్కొంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసిన ఈ ఉద్యోగాల భర్తీ కోసం 12 మార్చి 2019న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఇందులో దరఖాస్తు చేసుకోవడానికి 12 ఏప్రిల్ 2019 వరకు సమయం ఇచ్చారు. కాగా ఈ ఉద్యోగాలకు సంబంధించి మొదటి దశ పరీక్ష 17 ఆగస్టు 2022న జరుగుతుంది.

RRB గ్రూప్ D అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే..

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ముందుగా అధికారిక వెబ్‌సైట్ rrb.digialm.comకి వెళ్లాలి. వెబ్‌సైట్ హోమ్ పేజీలో, RRB గ్రూప్ D స్థాయి I పై క్లిక్ చేయాలి. ఇప్పుడు అభ్యర్థి లాగిన్ లింక్‌కి వెళ్లి, అక్కడ డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ ఎంటర్ చేశాక అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌ పై కనిపిస్తుంది. తర్వాత అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

కాగా.. RRB గ్రూప్ D ఫేజ్ 2 పరీక్షలు ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనుంది. రెండో దశ కింద హాజరయ్యే అభ్యర్థులు తమ పరీక్ష నగర తేదీ వివరాల గురించి ఆగస్టు 18న సమాచారాన్ని పొందవచ్చు. 17 ఆగస్టు 2022 నుంచి ప్రారంభం కానున్న రైల్వే గ్రూప్ డి రిక్రూట్‌మెంట్ పరీక్షల తేదీల, కేంద్రాల వివరాలు ఆగస్టు 9న విడుదలయ్యాయి.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పరీక్ష కోసం 1 కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష CBT, కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్, పీఈటీకి హాజరు కావాల్సి ఉంటుందని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటనలో వెల్లడించింది.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.