TSPSC Results 2024: టీఎస్పీయస్సీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకులు.. వచ్చేనెలలో నియామకాలు

|

Aug 29, 2024 | 4:31 PM

తెలంగాణ రాష్ట్రంలోని పశుసంవర్ధక శాఖలో ఎప్పటి నుంచో నానుతున్న పశువైద్యుల పోస్టులకు ఇన్నాళ్లకు మోక్షం లభించింది. ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (వీఏఎస్‌) పోస్టుల భర్తీకి దాదాపు 20 నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల రిత్యా ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉంది. తాజాగా ఈ ప్రక్రియను..

TSPSC Results 2024: టీఎస్పీయస్సీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకులు.. వచ్చేనెలలో నియామకాలు
Veterinary Assistant Surgeon Jobs
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 29: తెలంగాణ రాష్ట్రంలోని పశుసంవర్ధక శాఖలో ఎప్పటి నుంచో నానుతున్న పశువైద్యుల పోస్టులకు ఇన్నాళ్లకు మోక్షం లభించింది. ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (వీఏఎస్‌) పోస్టుల భర్తీకి దాదాపు 20 నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల రిత్యా ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉంది. తాజాగా ఈ ప్రక్రియను టీజీపీఎస్సీ పూర్తి చేసింది. గత ప్రభుత్వం మొత్తం 185 పశువైద్యుల పోస్టుల భర్తీకి 2022 డిసెంబరు 30న నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ పోస్టులకు గతేడాది జులై 13, 14 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు.

తాజాగా వాటి ఫలితాలు వెల్లడించిన కమిషన్‌.. త్వరలోనే నియామక పత్రాలు కూడా అందించనుంది. మొత్తం 185 పోస్టులకు గానూ 171 పోస్టులకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేసింది. మరో 14 పోస్టులకు అర్హులు లేకపోవడంతో ప్రస్తుతం వాటి భర్తీ ప్రక్రియను చేపట్ట లేదు. సెప్టెంబరు 15వ తేదీ నాటికి ఎంపికైన 171 మంది వీఏఎస్‌లకు నియమక ఉత్తర్వులు పంపిణీ చేయనున్నారు. పశు సంవర్ధక శాఖలో గడిచిన రెండేళ్లలో పదవీ విరమణలు, పదోన్నతులు, ఇతర కారణాల వల్ల మరో 121 వీఏఎస్‌ల పోస్టులు ఖాళీ అయినట్లు కమిషన్‌ వర్గాలు చెబుతున్నాయి. వాటి భర్తీకి మళ్లీ నోటిఫికేషన్‌ వెలువరించే అవకాశం ఉంది.

ఇరకాటంలో పశువైద్య పోస్టులు.. ఎప్పటికి పూర్తి అయ్యేనో?

మరోవైపు పశువైద్య విశ్వవిద్యాలయానికి సంబంధించిన పోస్టుల భర్తీకి మాత్రం గ్రహణం వీడటం లేదు. గతేడాది జూన్‌లో 105 మంది బోధన సిబ్బంది నియామకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనుమతి లభించింది. ఇందులో మామునూరు కళాశాలలో 11 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, 14 అసిస్టెంట్‌ ప్రొఫెసర్, సిద్దిపేటలో 18 ప్రొఫెసర్, ఒక డీన్, 17 అసోసియేట్‌ ప్రొఫెసర్, 44 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. ఇంతలో న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో వాటిని భర్తీ చేయకుండా ఆపేశారు. పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యార్ధులు ఇక్కట్లు పడుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఆయా కాలేజీలకు గుర్తింపు వచ్చే అవకాశం కూడా సందేహాస్పదంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.