Maya Tata: మామకు తగిన మేనకోడలు.. వ్యాపార రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న రతన్ టాటా మేనకోడలు

|

May 22, 2024 | 3:15 PM

ప్రఖ్యాత వ్యాపారవేత్త రతన్ టాటా మేనకోడలు మాయా టాటా. టాటా సామ్రాజ్యానికి సంభావ్య వారసుల్లో ఒకరిగా తన ప్రత్యేకతను నిలుపుకున్నారు. ముఖ్యంగా ఇంటిపేరుతో వచ్చే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. 34 ఏళ్ల ఆమె రతన్ టాటా సవతి సోదరుడు అయిన ఆలూ మిస్త్రీ, నోయెల్ టాటాల కుమార్తె మాయ. ఆమె తోబుట్టువులు లేహ్, నెవిల్లేతో పాటు, మాయ టాటా గ్రూప్ సోపానక్రమంలోని ఒక ముఖ్యమైన సంస్థ అయిన టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో పనిచేస్తున్నారు.

Maya Tata: మామకు తగిన మేనకోడలు.. వ్యాపార రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న రతన్ టాటా మేనకోడలు
Maya Tata
Follow us on

భారతదేశంలో ఇప్పటికీ పితృస్వామ్య సమాజం ఉంది. ముఖ్యంగా ఆడవాళ్లు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపార రంగంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నారు. అయితే కొంత మంది మాత్రం ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన మహిళే మాయా టాటా. ప్రఖ్యాత వ్యాపారవేత్త రతన్ టాటా మేనకోడలు మాయా టాటా. టాటా సామ్రాజ్యానికి సంభావ్య వారసుల్లో ఒకరిగా తన ప్రత్యేకతను నిలుపుకున్నారు. ముఖ్యంగా ఇంటిపేరుతో వచ్చే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. 34 ఏళ్ల ఆమె రతన్ టాటా సవతి సోదరుడు అయిన ఆలూ మిస్త్రీ, నోయెల్ టాటాల కుమార్తె మాయ. ఆమె తోబుట్టువులు లేహ్, నెవిల్లేతో పాటు, మాయ టాటా గ్రూప్ సోపానక్రమంలోని ఒక ముఖ్యమైన సంస్థ అయిన టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారం రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న మాయ టాటా గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

మాయ టాటా తల్లి ఆలూ మిస్త్రీ, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ సోదరి, దివంగత బిలియనీర్ పల్లోంజీ మిస్త్రీ కుమార్తె కావడంతో మాయ తల్లితరఫు వాళ్లు వ్యాపారం రంగంలో ఉన్నారని తెలుస్తుంది.  ముఖ్యంగా మాయ అత్త, సైరస్ మిస్త్రీ భార్య రోహికా మిస్త్రీ నికర విలువ రూ. 56,000 కోట్లు. అందువల్ల ఆమె భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో స్థానం సంపాదించింది. మాయ తన తోబుట్టువులలో చిన్నది అయినప్పటికీ టాటా గ్రూప్‌లో తన కెరీర్‌లో గణనీయమైన పురోగతి సాధించింది. ఆమె యూకే లోని బేయర్స్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్‌లో విద్యాభ్యాసం చేసింది. 

ముఖ్యంగా మాయ టాటా క్యాపిటల్‌కు సంబంధించిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అయిన టాటా ఆపర్చునిటీస్ ఫండ్‌తో ప్రారంభమైంది. తరువాత మాయ టాటా డిజిటల్ అనే అనుబంధ సంస్థకు మారారు. అక్కడ ఆమె టాటా న్యూ యాప్‌ను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించింది. అనంతరం టాటా ఆపర్చునిటీస్ ఫండ్‌లో ఆమె పదవీకాలంలో పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్, ఇన్వెస్టర్ రిలేషన్స్‌లో మాయ చేసిన సహకారాన్ని అందరూ గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం 2011లో రతన్ టాటా స్వయంగా ప్రారంభించిన కోల్‌కతా ఆధారిత క్యాన్సర్ ఆసుపత్రిని పర్యవేక్షిస్తూ టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్‌కు సంబంధించిన ఆరుగురు బోర్డు సభ్యులలో ఒకరిగా మాయ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి