Railway Jobs 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు! డైరెక్ట్ లింక్ ఇదే

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన పంజాబ్‌లోని పాటియాల లోకోమోటివ్‌ వర్క్స్‌ ఇండియాన్‌ రైల్వేస్‌ (PLW).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 225 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ..

Railway Jobs 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు! డైరెక్ట్ లింక్ ఇదే
Railway PLW Apprentice Recruitment

Updated on: Dec 07, 2025 | 4:19 PM

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన పంజాబ్‌లోని పాటియాల లోకోమోటివ్‌ వర్క్స్‌ ఇండియాన్‌ రైల్వేస్‌ (PLW).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 225 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్‌ 22, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

విభాగాల వారిగా అప్రెంటిస్ ఖాళీల వివరాలు ఇలా..

  • ఎలక్ట్రీషియన్‌ విభాగంలో ఖాళీల సంఖ్య: 120
  • మెకానిక్‌(డీసిల్‌) విభాగంలో ఖాళీల సంఖ్య: 25
  • మిషినిస్ట్‌ విభాగంలో ఖాళీల సంఖ్య: 12
  • ఫిట్టర్‌ విభాగంలో ఖాళీల సంఖ్య: 50
  • వెల్డర్‌(జీ&ఈ) విభాగంలో ఖాళీల సంఖ్య: 18

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐలో సర్టిఫికెట్‌ ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్ 22, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.9,600 నుంచి రూ.11,040 వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింద అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.