Pawan Hans Limited Jobs 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో హెలికాప్టర్ కంపెనీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

భారత్ ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన హెలికాప్టర్ కంపెనీ అయిన పవన్‌ హాన్స్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన పైలట్, అసోసియేట్‌ మేనేజర్‌ పోస్టుల (Associate Manager Posts) భర్తీకి..

Pawan Hans Limited Jobs 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో హెలికాప్టర్ కంపెనీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Pawan Hans Limited
Follow us
Srilakshmi C

|

Updated on: May 06, 2022 | 5:32 PM

Pawan Hans Limited Associate Helicopter Pilot Recruitment 2022: భారత్ ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన హెలికాప్టర్ కంపెనీ అయిన పవన్‌ హాన్స్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన పైలట్, అసోసియేట్‌ మేనేజర్‌ పోస్టుల (Associate Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: అసోసియేట్‌ పైలట్, అసోసియేట్‌ మేనేజర్‌, చీఫ్‌ ఆప్‌ ప్లైట్‌ సేఫ్టీ, చీఫ్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 14

విభాగాలు: హెచ్‌ఆర్‌ అండ్‌ అడ్మిన్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, మెటీరియల్స్‌

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.70,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, ఎంబీఏ, పీజీ డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 12, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

Also Read:

CRPF Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌..! సీఆర్‌పీఎఫ్‌లో డిప్యూటీ కమాండెంట్‌ఉద్యోగాలు..