Scholarship: బీటెక్‌ విద్యార్థులకు స్కాలర్షిప్‌ పొందే అవకాశం.. నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ. 42,500.. ఇలా అప్లై చేసుకోండి..

|

Nov 03, 2022 | 11:14 AM

తక్కువ ఆదాయం ఉన్న కుంటుంబం నేపథ్యం కలిగి ఉన్నత చదువులు చదువుతోన్న విద్యార్థుల కోసం పానాసోకిన్‌ బంపరాఫర్‌ ప్రకటించింది. పై చదువుల కోసం ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజు చెల్లించేందుకు ఈ స్కాలర్షిప్‌ను అందిస్తున్నారు...

Scholarship: బీటెక్‌ విద్యార్థులకు స్కాలర్షిప్‌ పొందే అవకాశం.. నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ. 42,500.. ఇలా అప్లై చేసుకోండి..
Panasonic Scholarship
Follow us on

తక్కువ ఆదాయం ఉన్న కుంటుంబం నేపథ్యం కలిగి ఉన్నత చదువులు చదువుతోన్న విద్యార్థుల కోసం పానాసోకిన్‌ బంపరాఫర్‌ ప్రకటించింది. పై చదువుల కోసం ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజు చెల్లించేందుకు ఈ స్కాలర్షిప్‌ను అందిస్తున్నారు. ఐఐటీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తున్నారు. ఇంతకీ ఈ స్కాలర్‌షిప్‌ పొందడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా ఐఐటీలో బీఈ/బీటెక్‌ కోర్సు చదువుతుండాలి. లేదంటే ఇంటర్‌ పూర్తయిన లేదా ఫలితాల కోసం వేచి చూస్తున్న వారు కూడా అర్హులు. ఇంటర్‌లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కుటుం వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి. కేవలం భారతీయ విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులు. 2022-23 బ్యాచ్ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ. 42,500 చొప్పున నాలుగేళ్ల పాటు అందిస్తారు.

ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి 12వ తరగతి మార్క్ షీట్ (2021-22), ఓటర్‌ ఐడి/ఆధార్‌ కార్డు/డ్రైవింగ్‌ లైసెన్స్‌/పాస్‌ కార్డ్ గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. అడ్మిషన్ లెటర్, ఫస్ట్ సెమిస్టర్ ఫీజు రిసిప్ట్ కలిగి ఉండాలి. వీటితో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇన్ కమ్ సర్టిఫికెట్, విద్యార్థి ఫొటో ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు నవంబర్‌ 11, 2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..